Begin typing your search above and press return to search.

చెడిపోయిన బుర్రతో అక్కడ .. మంచి బుర్రతో ఇక్కడ : రాజధాని ఉద్యమం పై సీఎం జగన్ !

By:  Tupaki Desk   |   17 Dec 2020 12:54 PM GMT
చెడిపోయిన బుర్రతో అక్కడ .. మంచి బుర్రతో ఇక్కడ : రాజధాని ఉద్యమం పై సీఎం జగన్ !
X
ఏపీలో రాజధాని రగడ మళ్లీ కాకరేపుతోంది. పీకి మూడు రాజధానులు ఏర్పాటు చేయబోతున్నట్టు ఏపీ సీఎం జగన్ అసెంబ్లీలో ప్రకటన చేసిన సమయం నుండే ఏపీ రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని ఏడాది నుంచి అమరావతి ప్రాంతంలోని రైతులు నిరసన తెలుపుతున్నారు. ఈ ఉద్యమం సంవత్సరం పూర్తి అయిన నేపథ్యంలో అమరావతి జేసీఏ రాయపూడిలో జనభేరి పేరుతో భారీ బహిరంగ సభను నిర్వహించింది. ఈ సభ వేదికగా రైతులు భవిష్యత్‌ ఉద్యమ కార్యాచరణను ప్రకటించనున్నారు.

ఇదిలా ఉంటే .. ఓవైపు అమరావతి ఉద్యమం ప్రారంభమై ఏడాది పూర్తి అయింది అంటూ జనభేరి సభ నిర్వహిస్తుంటే .. ప్రభుత్వం బీసీ సంక్రాంతి వేడుకలు నిర్వహించింది. బీసీ కార్పొరేషన్లలో అత్యధిక శాతం నా అక్కాచెల్లెమ్మలే ఉండటం సంతోషంగా ఉందన్నారు. వెనుకబడిన వర్గాలకు ఈ స్థాయిలో పదవులు దేశ చరిత్రలో ఇదే తొలిసారి అని, అందులోనూ సగభాగం మహిళలకు ఇవ్వడం దేశంలో ఎక్కడా లేదని సీఎం వైస్ జగన్ చెప్పారు. ఇదే సమయంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు పై నిప్పులు చెరిగారు.

ఏపీ రాజధానిగా అమరావతిని ముందే నిర్ణయించుకొని ,బినామీ పేర్లతో భూములు కొనుగోలు చేయించారని సీఎం జగన్ వెల్లడించారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ చేసి తక్కువ ధరకు భూములు కొన్నారని, భూముల ధరలు పడిపోతాయనే భయంతోనే ఇప్పుడు అమరావతి ఉద్యమం చేయిస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. దిగిపోయిన పాలకుడు..చెడిపోయిన బుర్రతో తాను సొంతంగా లాభ పడేందుకు, బాగు పడేందుకు ఇన్ సైడర్ ట్రేడింగ్ చేసి, రైతుల దగ్గరి నుంచి బినామీలతో తక్కువ ధరకు కొనుగోలు చేయించి, అక్కడే రాజధాని పెట్టాలని ముందే నిర్ణయించి, దాని చుట్టు గుట్టుచప్పుడు కాకుండా, తాను అతని బినామీల నుంచి కొనుగోలు చేసి, భూముల రేట్లు ఎక్కడ పడిపోతాయనే ఆందోళనతో కాపాడుకోవాలనే ఉద్దేశ్యంతో ఉద్యమం చేస్తాననడం చూస్తున్నామన్నారు. చెడిపోయిన బుర్రతో పనిచేస్తే ఎలా ఉంటుందో అక్కడ కనిపిస్తుంది..మంచి బుర్రతో పని చేస్తే ఎలా ఉంటుందో..ఇక్కడ కనిపిస్తుందన్నారు.