Begin typing your search above and press return to search.

కర్ఫ్యూపై కీలక నిర్ణయం తీసుకున్న సీఎం జగన్ !

By:  Tupaki Desk   |   17 May 2021 9:27 AM GMT
కర్ఫ్యూపై కీలక నిర్ణయం తీసుకున్న సీఎం జగన్ !
X
ఏపీలో కరోనా వైరస్ మహమ్మారి విజృంభణ రోజురోజుకి భారీగా పెరిగిపోతున్న తరుణంలో రాష్ట్రంలో కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటూ కొరోనా కట్టడికి కృషి చేస్తుంది. ఏపీలో కరోనా వ్యాప్తి పెరుగుతోన్న నేసథ్యంలో ప్రస్తుతం అమలు చేస్తోన్న కర్ఫ్యూను నెలాఖరు వరకూ పొడిగించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సూచించారు. కరోనా కట్టడికి సరైన ఫలితాలు రావాలంటే కనీసం నాలుగువారాలు కర్ఫ్యూ ఉండాలని సీఎం జగన్ అన్నారు. రాష్ట్రంలో కర్ఫ్యూ విధించి సుమారు 10 రోజులే దాటిందని, ఇంకా కొన్ని రోజులు కర్ఫ్యూను అమలు చేస్తే ఖచ్చితంగా ఫలితాలు వస్తాయని సీఎం అన్నారు. రూరల్‌ ప్రాంతంలో కేసులు పెరగకుండా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.

వాలంటీర్లు, ఆశావర్కర్లు, సచివాలయాల వ్యవస్థలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కరోనా మహమ్మారి కారణంగా తల్లిదండ్రులు ఎవరైనా చనిపోతే వారి పిల్లలను ఆదుకునేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు కోరారు. వారికి ఆదుకునేలా ఆర్థికసహాయంపై తగిన కార్యాచరణ రూపొందించాలని జగన్ సూచించారు. అటువంటి పిల్లలకు కొంత మొత్తాన్ని డిపాజిట్‌ చేసేలా, దానిపై వచ్చే వడ్డీ ప్రతినెలా వారి ఖర్చులకోసం వచ్చేలా ఆలోచనలు చేయాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు.బ్లాక్ ఫంగస్‌ చికిత్సను సైతం ఆరోగ్యశ్రీలో చేర్చుతున్నట్టు ప్రకటించారు. ఆ ఇవాళ ఏపీ కేబినెట్‌ సబ్‌ కమిటీ సమావేశం జరిగింది.

కరోనా వైరస్ మరణాలకు అడ్డుకట్ట వేసేందుకు త్వరలోనే ఆర్టీసీ బస్సుల్లో మొబైల్‌ ఆక్సిజన్‌ బెడ్లను అందుబాటులోకి తెస్తామని రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని తెలిపారు. ఏజెన్సీ ప్రాంతాల్లో సత్వరమే వైద్యం అందించేలా ఆర్టీసీ స్లీపర్‌ ఏసీ బస్సుల్లో పది ఆక్సిజన్‌ కాన్సెంట్రేట్‌ మిషన్లు ఏర్పాటు చేస్తామని.. ఇందుకోసం గ్రీన్‌కో సంస్థ అధినేత చలమలశెట్టి అనిల్‌ ముందుకొచ్చారన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పోలవరంలో త్వరలోనే మొబైల్‌ ఆక్సిజన్‌ బెడ్స్‌ అందుబాటులోకొస్తాయన్నారు.