Begin typing your search above and press return to search.
ఏపీ కొత్త జిల్లాలపై కీలక నిర్ణయం ఇవాళేనట
By: Tupaki Desk | 15 July 2020 4:45 AM GMTగడిచిన కొద్దికాలంగా ఏపీలో హాట్ టాపిక్ గా మారిన కొత్త జిల్లాలకు సంబంధించిన కీలకమైన ప్రకటన ఈ రోజు వెలువడుతుందని చెబుతున్నారు. దీనికి సంబంధించిన నిర్ణయాన్ని ఈ రోజు నిర్వహించే కేబినెట్ సమావేశంలో తీసుకుంటారని చెబుతున్నారు. ఎన్నికలకు ముందు తమ పార్టీ అధికారంలోకి వస్తే..ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా మారుస్తానంటూ జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు.
దీనికి తగ్గట్లే.. అధికారంలోకి వచ్చిన ఈ ఏడాది కాలంలో కొత్త జిల్లాలకు సంబంధించిన కసరత్తు జోరుగా సాగుతోంది. దీనికి సంబంధించి ఇప్పటికే పలు అంశాలు బయటకు వచ్చాయి. ప్రస్తుతం ఏపీలో పదమూడు జిల్లాలు ఉండగా.. ఎంపీ స్థానాలు పాతిక ఉన్నాయి. దీంతో.. మరో 13 జిల్లాలు కొత్తవి రానున్నట్లు చెబుతున్నారు. అయితే.. దీనికి అదనంగా ఒకట్రెండు కొత్త జిల్లాల్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందన్న ప్రచారం సాగుతోంది.
ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం తొలుత అనుకున్న పాతిక జిల్లాల స్థానే మరో రెండు జిల్లాలతో కలిసి 27 జిల్లాలు ఏర్పాటు చేసే అవకాశం ఉందంటున్నారు. కొత్త జిల్లాలపై కసరత్తు జరుగుతున్న సమయంలోనే జనాభా గణన ప్రక్రియ తెర మీదకు వచ్చింది. దీంతో.. కేంద్రం ఫ్రీజింగ్ ఉత్తర్వుల్ని జారీ చేసింది.
ఈ ఉత్తర్వుల ప్రకారం గ్రామాలు..మండలాలు.. రెవెన్యూ డివిజన్లు.. జిల్లా సరిహద్దుల్ని మార్చే వీల్లేదు. ఇలా అయితే.. కొత్త జిల్లాల ఏర్పాటుసాధ్యం కాదు. అయితే.. ఇప్పటికిప్పుడు కొత్త జిల్లాల్ని అధికారికంగా ఏర్పాటు చేయకపోవచ్చు కానీ.. వాటికి సంబంధించిన అధ్యయనం చేసేందుకు ఎలాంటి అభ్యంతరాలు లేవని చెబుతున్నారు. దీంతో.. ఆ దిశగా కసరత్తు సాగుతోంది.
తమకున్న వెసులుబాటుతో కొత్త జిల్లాలకు సంబంధించిన కీలక నిర్ణయం తీసుకున్నా ఎలాంటి ఇబ్బంది ఉండదని చెబుతున్నారు. దీంతో.. ఈ రోజు జరిగే మంత్రివర్గ సమావేశంలో కొత్త జిల్లాలపై ప్రభుత్వం ఒక క్లారిటీ ఇవ్వటంతో పాటు.. కీలక నిర్ణయాన్ని ప్రకటించే అవకాశాలే ఎక్కువంటున్నారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ గతంలో చెప్పినట్లుగా పార్లమెంటు నియోజకవర్గ వర్గాల ఆధారంగా కొత్త జిల్లాల్ని ఏర్పాటు చేస్తే... పలు కొత్త సమస్యలు వస్తాయని అధికారపార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు.
కొన్నిజిల్లాల ఏర్పాటుపై స్థానికంగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మరికొన్ని కొత్త జిల్లాలకు సంబంధించిన డిమాండ్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అందరికి ఆమోదయోగ్యంగా ఉండేలా కొత్త జిల్లాలకు సంబంధించి నిర్ణయం కష్టతరమనే అభిప్రాయం ఉంది. ఈ నేపథ్యంలో జగన్ సర్కారు కొత్త జిల్లాల కసరత్తుపై ఎలాంటి ప్రకటన చేయనుందన్నది ఇప్పుడు ఉత్కంటను రేకెత్తిస్తోంది.