Begin typing your search above and press return to search.

ప్రార్థనా స్థలాలు - మందిరాలకు జగన్ గిఫ్ట్

By:  Tupaki Desk   |   20 April 2020 3:00 PM GMT
ప్రార్థనా స్థలాలు - మందిరాలకు జగన్ గిఫ్ట్
X
ఏపీలోని అన్ని దేవాలయాలు - మసీదులు - చర్చిలకు రూ.5000 ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించారు. ఈ మేరకు వీడియో కాన్పరెన్సులో కలెక్టర్లను ఆదేశించారు. కోవిడ్ 19 వల్ల రాష్ట్రం ఆదాయం కోల్పోయినా కూడా ఆయా ఆధ్యాత్మిక కేంద్రాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి జగన్ చెప్పారు. రంజాన్ మాసం రానున్న సందర్భంగా ప్రతి ఒక్కరు ఇళ్లలోనే ప్రార్థనలు చేసుకునేలా పిలుపు ఇవ్వాలని తాను అడిగినవిధంగా... అనునయించని ముస్లిం మతపెద్దలకు సీఎం కృతజ్జతలు చెప్పారు.

ఏపీ ప్రభుత్వం ప్రతిరోజు 150 కోట్ల ఆదాయం కోల్పోతున్నట్లు వెల్లడించిన జగన్... ఎలాంటి పరిస్థితుల్లోను తన బాధ్యతను మాత్రం ప్రభుత్వం మరిచిపోదని...అందుకే ఈ క్లిష్ట సమయంలోను ఆర్థిక సహాయం ప్రకటించినట్లు జగన్ చెప్పారు. గత ఏడాది సాయం అందుకున్న అన్ని స్థలాలకు ఈ డబ్బులు అందుతాయని జగన్ స్పష్టం చేశారు. గత ఏడాది అందనివి ఏవైనా ఉంటే వాటికి కూడా ఈ సాయం అందేలా చూడాలని జగన్ కలెక్టర్లకు సూచించారు.

ప్రభుత్వం ఏ ఒక్కరిదో కాదని... సామాజిక - కుల - మత బేధాలు లేకుండా ప్రతి ఒక్కరూ సంతృప్తికరమైన జీవితం గడపాలన్నదే తమ ధ్యేయం అన్నారు. అందుకే సంక్షేమ పథకాలు పేదరికం ప్రాతిపదికన ఎంపిక జరుగుతుందని - ప్రతి ఒక్కరికి సమన్యాయం దక్కుతుందని జగన్ చెప్పారు. ప్రభుత్వం మీద ప్రజలు పెట్టుకున్న నమ్మకం అలాగే ఉంచాలనే ఉద్దేశంతో ఆదాయం కోల్పోయిన పేద వర్గాలను ఆదుకోవడానికి.. ప్రతి కుటుంబానికి వెయ్యి రూపాయల నగదు, రేషను ఉచితంగా ఇచ్చినట్లు జగన్ చెప్పారు.