Begin typing your search above and press return to search.

ఒకే దెబ్బ‌కు.. అటు బాల‌కృష్ణ ఇటు బాబు

By:  Tupaki Desk   |   19 March 2022 11:30 AM GMT
ఒకే దెబ్బ‌కు.. అటు బాల‌కృష్ణ ఇటు బాబు
X
ఏపీలో వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ విజ‌యం సాధించి రెండోసారి అధికారంలోకి రావాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఉన్న సీఎం జ‌గ‌న్‌.. ఆ దిశ‌గా ఇప్ప‌టి నుంచే క‌స‌ర‌త్తులు మొద‌లెట్టారు. రాజకీయాంగా టీడీపీని దెబ్బ కొట్టేందుకు ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేస్తున్నారు. అన్ని వైపులా టీడీపీ అధినేత చంద్ర‌బాబును ఆత్మ‌ర‌క్ష‌ణ‌లోకి నెట్ట‌డమే ల‌క్ష్యంగా జ‌గ‌న్ ముందుకు సాగుతున్నారు. తాజాగా ఏపీ జిల్లాల పున‌ర్విభ‌జ‌న‌పై వ‌చ్చిన ఫిర్యాదులు, డిమాండ్లు, సూచ‌న‌ల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకున్న జ‌గ‌న్‌.. ఒకేసారి బాల‌కృష్ణ‌కు బాబుకు షాక్ ఇచ్చేందుకు సిద్ధ‌మైన‌ట్లు స‌మాచారం.

ఆ డిమాండ్‌పై..

ఇప్ప‌టికే రాష్ట్రంలోని 13 జిల్లాల‌ను 26కు పెంచుతూ ప్ర‌భుత్వం ముసాయిదా నోటిఫికేష‌న్ జారీ చేసింది. ఉగాది నుంచి కొత్త జిల్లాల్లో పాల‌న ప్ర‌క్రియ మొద‌లెట్టేలా జ‌గ‌న్ అడుగులు వేస్తున్నారు. అయితే జిల్లాల పేర్లు, మండ‌లాల విలీనం, రెవెన్యూ డివిజ‌న్‌, జిల్లా కేంద్రాలు.. ఇలా జిల్లాల విభ‌జ‌న‌పై డిమాండ్లు వ‌చ్చాయి. అధికార వైసీపీతో పాటు టీడీపీ నేత‌లు త‌మ అభ్యంత‌రాల‌ను ప్ర‌భుత్వానికి అందించారు. వీటిని ప‌రిశీలించిన జ‌గ‌న్ అసెంబ్లీలో కీల‌క ప్ర‌క‌ట‌న చేయ‌బోతున్నార‌ని స‌మాచారం. ముఖ్యంగా టీడీపీని ఇర‌కాటంలో పెట్టేలా ఆయ‌న నిర్ణ‌యం తీసుకుంటున్నార‌ని తెలిసింది. టీడీపీ ఎమ్మెల్యే బాల‌కృష్ణ ప్రాతినిథ్యం వ‌హిస్తున్న హిందూపూర్‌ను జిల్లా కేంద్రంగా చేయాలంటూ ఆయ‌న డిమాండ్ చేశారు. ఆందోళ‌న‌ల్లో పాల్గొన్నారు. టీడీపీకి కంచుకోట‌గా ఉన్న హిందూపూర్‌లో వైసీపీ జెండా ఎగ‌రేయాల‌ని చూస్తున్న జ‌గ‌న్‌.. బాల‌కృష్ణ డిమాండ్‌పై సానుకూలంగా స్పందించే అవ‌కాశం ఉంది.

కుప్పంపైనా ఓ నిర్ణ‌యం..

మ‌రోవైపు చంద్ర‌బాబుకు పెట్ట‌ని కోట్ అయిన కుప్పం నియోజ‌క‌వ‌ర్గాన్ని రెవిన్యూ డివిజ‌న్ చేయాలంటూ టీడీపీ నేత‌లు ప్ర‌భుత్వానికి విన‌తి ప‌త్రం అందించారు. 14 ఏళ్లు ముఖ్య‌మంత్రిగా చేసిన బాబు త‌న సొంత నియోజ‌క‌వర్గాన్ని రెవిన్యూ డివిజ‌న్ చేయ‌లేక‌పోయార‌ని టీడీపీ నేత‌లే ప్ర‌భుత్వానికి మొర పెట్టుకున్న‌ట్లు స‌మాచారం. ఇప్పుడు కుప్పాన్ని రెవిన్యూ డివిజ‌న్ చేస్తూ జ‌గ‌న్ నిర్ణ‌యం తీసుకుని అక్క‌డ పూర్తి ఆధిక్యం సాధించేందుకు రూట్ క్లియ‌ర్ చేసుకుంటారని టాక్‌. ఇప్ప‌టికే రాష్ట్రంలో జ‌రిగిన పంచాయ‌తీ, మున్సిప‌ల్‌, మండ‌ల ప‌రిష‌త్‌, స‌ర్పంచ్ త‌దిత‌ర ఎన్నిక‌ల్లో కుప్పంలో వైసీపీ తిరుగులేని విజ‌యాలు సాధించింది. ఇప్పుడికి కుప్పాన్ని రెవిన్యూ డివిజ‌న్‌గా ప్ర‌క‌టిస్తే అక్క‌డ వైసీపీకి ఎదురుండ‌ద‌ని జ‌గ‌న్ భావిస్తున్నార‌ని స‌మాచారం.

ఇక విజ‌యవాడ‌కు ఎన్టీఆర్ పేరు పెట్ట‌డంపైనా అభ్యంత‌రాలు వ‌చ్చాయి. దీనిపై స‌భ‌లో టీడీపీ అభిప్రాయం చెప్ప‌మ‌ని వైసీపీ డిమాండ్ చేసే అవ‌కాశం ఉంది. విజ‌య‌వాడ‌కు ఎన్టీఆర్ పేరు కొన‌సాగించాల‌ని జ‌గ‌న్ ప్ర‌భుత్వం భావిస్తోంది. దీంతో అటు ఎన్టీఆర్ అభిమానుల‌ను.. బాల‌య్య డిమాండ్ తీర్చ‌డం ద్వారా టీడీపీ కార్య‌క‌ర్త‌ల‌ను ఆక‌ట్టుకోవ‌చ్చ‌ని.. కుప్పాన్ని రెవిన్యూ డివిజ‌న్ చేయ‌డం ద్వారా బాబుపై రాజ‌కీయంగా పైచేయి సాధించ‌వ‌చ్చ‌ని జ‌గ‌న్ అనుకుంటున్నార‌ని తెలిసింది.