Begin typing your search above and press return to search.
తోకపార్టీలు అవి అన్న కేసీఆర్.. వాళ్లతో జై కొట్టించాడు
By: Tupaki Desk | 13 April 2021 6:30 AM GMTదిగ్గజ కమ్యూనిస్టులు తెలుగు రాష్ట్రాల్లో కాలం చెల్లిపోయారు. ఆ పార్టీ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది.. ఇప్పుడు సీటు కాదు కదా.. కనీసం అసెంబ్లీ గేటు కూడా దాటడం వారి వల్ల కావడం లేదు. అందుకే ఇక ఏదో పార్టీకి మద్దతు ఇవ్వడమో.. తీసుకోవడమో తప్పితే కమ్యూనిస్టు పార్టీల గతి ఎటూ కాకుండా పోయిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు కమ్యూనిస్టులు కనీసం ఒక్క అసెంబ్లీ సీటు అయినా గెలిచే పరిస్థితి లేదు. వారి పరిస్థితి రానురాను కడుదీనంగా తయారవుతోంది. ఒకప్పుడు ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో బలంగా ఉన్న సీపీఐ, సీపీఎంలు ఇప్పుడు అక్కడ కూడా తుడిచిపెట్టుకుపోతున్నారు.
తాజాగా ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి మద్దతివ్వనున్నట్లు వామపక్షాలు ప్రకటించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. గతంలో కాంగ్రెస్ పార్టీతో కలిసి జట్టు కట్టి పోటీచేసిన సీపీఐ, సీపీఎంలు ఇప్పుడు గులాబీ పార్టీకి మద్దతు పలకడం చర్చనీయాంశమైంది. తోకపార్టీలు అంటే కేసీఆర్ చాలా సార్లు కమ్యూనిస్టు పార్టీలను ఎద్దేవా చేశారు. అయినా కూడా సీపీఐ, సీపీఎంలు టీఆర్ఎస్ కే జైకొట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఈనెల 17న జరిగే పోలింగ్ లో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ కు ఓటు వేయాలని కమ్యూనిస్టు శ్రేణులకు సీపీఐ, సీపీఎం పార్టీలు పిలుపునిచ్చాయి. ఎందుకంటే గతంలో నోముల నర్సింహాయ్య భీకర కమ్యూనిస్టు యోధుడు. ఆయన మరణించడం.. ఆయన కుమారుడు బరిలో ఉండడంతో కమ్యూనిస్టు పార్టీలు టీఆర్ఎస్ కు మద్దతు ప్రకటించాయి.
ఈ మేరకు సీపీఐ నల్గొండ జిల్లా కార్యదర్శి సత్యం ప్రెస్ నోట్ విడుదల చేశారు. ఇక సీపీఎం జిల్లా పార్టీ సైతం నోముల భగత్ కే మద్దతిచ్చింది.