Begin typing your search above and press return to search.

ఓకే వేదికపై సీఎం కేసీఆర్, బండి సంజయ్.. ఏం జరిగిందంటే? వీడియో వైరల్

By:  Tupaki Desk   |   26 Dec 2022 4:38 PM GMT
ఓకే వేదికపై సీఎం కేసీఆర్, బండి సంజయ్.. ఏం జరిగిందంటే? వీడియో వైరల్
X
రాజకీయాల్లో కొన్ని అరుదైన కలయికలు ఉంటాయి. ఒకరు అంటే ఒకరు పడని వారు కూడా కొన్ని సందర్భాల్లో కలిసి సాగాల్సిన పరిస్థితులు ఏర్పడుతాయి. అప్పుడు ఎంత హుందాగా ఉంటామన్న దానిపైనే వ్యక్తిత్వాలు ఆధారపడి ఉంటాయి. తెలంగాణ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్లు అయిన సీఎం కేసీఆర్, తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ లు ఒకేవేదికపై కనిపించడం వైరల్ గా మారింది.

కేసీఆర్ పేరు చెబితేనే బండి సంజయ్ ఒంటికాలిపై లేస్తారు. సెటైర్లతో విరుచుకుపడుతుంటాడు. పరుష పదజాలంతో తిట్టిపోస్తుంటాడు. ఈ ఇద్దరూ గాడిద, సన్నాసి అంటూ బండ బూతులు పరస్పరం తిట్టుకున్నవారే. అయితే హైదరాబాద్ లోని రాష్ట్రపతి భవన్ కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వచ్చిన సందర్భంగా ఆమెను పలువురు అగ్రనేతలు కలిశారు.

ఈ క్రమంలోనే స్టేజీపై ఉన్న రాష్ట్రపతికి సీఎం కేసీఆర్ అందరినీ పరిచయం చేసే కార్యక్రమం పెట్టుకున్నారు. మంత్రులు, ప్రతిపక్ష నేతలను పరిచయం చేస్తున్నారు. ఈ సందర్బంగా ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఈక్రమంలోనే తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ కూడా వేదికమీదకు వచ్చారు. అయితే బండి సంజయ్ మాత్రం కేసీఆర్ ను పట్టించుకోకుండా రాష్ట్రపతి ఆ తర్వాత గవర్నర్ కు నమస్కారం చేసి వెళ్లిపోయారు.

కేసీఆర్ సభావేదికపై నేతలను పరిచయం చేస్తుండగా బండి సంజయ్, కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా హాజరయ్యారు. వరుస క్రమంలో నేతలంతా వేదికపైకి వస్తుంటే వాళ్లను రాష్ట్రపతికి కేసీఆర్ పరిచయం చేస్తున్నారు. క్యూలో బండి సంజయ్ కూడా ఉన్నారు. ఆయన రావడానికి సంకోచిస్తుంటే వెంటనే స్పందించిన కేసీఆర్.. బండి సంజయ్ ను రావాలంటూ పిలిచారు. ఈ క్రమంలోనే రాష్ట్రపతికి బండి సంజయ్ ను పరిచయం చేశారు. అయితే కేసీఆర్ పిలిచాన ఆయన వైపు కన్నెత్తి చూడకుండా రాష్ట్రపతికి నమస్కారం పెట్టి బండి వెళ్లిపోయారు.

నిత్యం కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేసే బండి సంజయ్..ప్రెస్ మీట్ లలో బండిపై విరుచుకుపడే కేసీఆర్ ఇలా ఒకే వేదికపై రావడం సర్వత్రా చర్చనీయాంశమైంది. అయితే బండి సంజయ్ వ్యహరించిన తీరుపై విమర్శలు వస్తున్నాయి. కేసీఆర్ పిలిచినా ఆయన వైపు తిరిగి చూడకుండా రూడ్ గా వ్యవహరించడాన్ని అందరూ తప్పుపడుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.