Begin typing your search above and press return to search.
ఇది నిజంగా అందరి మనసు గెలిచే పని కేసీఆర్
By: Tupaki Desk | 26 Feb 2018 5:18 PM GMTకొన్ని అంశాలు సమాజంలో సుదీర్ఘకాలంగా చర్చ జరుగుతుంటాయి. నిజంగా అవి చాలా బాధాకరం. వాటికి పరిష్కారం అర్హత లేదా అంటే...వందకు వంద శాతం అర్హత ఉంటుంది. కానీ అలాంటి బాధకరమైన ఘటనలు అలా ఉండిపోతాయి. ఇలాంటి అతి కొద్ది అంశాల్లో రైతు సమస్యలు ప్రథమ స్థానంలో ఉంటాయి. పాలకులు మారినా అవి అలాగే ఉంటున్నాయి. కడుపు నిండా బువ్వ పెట్టే రైతన్నకు సంబంధించిన అనేకమందికి ఆవేదన మిగిల్చే ఆ సమస్యకు తనవంతు పరిష్కారం చూపేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కీలక నిర్ణయం ఒకటి ప్రకటించారు.
రైతన్నకు మేలు చేసేందుకు పలు నిర్ణయాలు తీసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ తాజాగా వారి తుది శ్వాస తర్వాత కూడా కుటుంబ సభ్యులకు మేలు చేసేందుకు నిర్ణయించారు. రైతులకు రూ. 5 లక్షల ప్రమాద బీమా అమలు చేస్తామని సీఎం ప్రకటించారు. `రైతుకు అనారోగ్యం వచ్చినా.. అకాల మరణం పొందినా రూ. 5 లక్షల బీమా కల్పిస్తాం.. బీమాకు సంబంధించిన ప్రీమియం కూడా ప్రభుత్వం చెల్లిస్తుంది` అని స్పష్టం చేశారు. కరీంనగర్ అంబేడ్కర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన రైతు సమన్వయ సమితి ప్రాంతీయ సదస్సులో సీఎం రైతులను ఉద్దేశించి ప్రసంగించారు. 70 లక్షల మంది రైతులకు బీమా సదుపాయం అమలు చేస్తామని వెల్లడించారు. కరీంనగర్ నుంచి ఏది మొదలు పెట్టినా విజయవంతం అవుతుంది కాబట్టే.. రైతులకు బీమా సదుపాయం ఇక్కడి నుంచి ప్రకటిస్తున్నానని సీఎం తెలిపారు. రైతులకు ప్రమాద బీమా చేయించడంలో రైతు సమన్వయ సమితులదే కీలకపాత్ర అని సీఎం చెప్పారు. ఇక మామిడి తోటలు సహా అన్ని పండ్ల తోటల రైతులకు కూడా పెట్టుబడి సాయం అందిస్తామని స్పష్టం చేశారు. ఎవరైనా పెట్టుబడి సాయం వదులుకున్న మొత్తాన్ని రైతు సమితి నిధికే కేటాయిస్తామని తెలిపారు. కౌలు రైతులకు పెట్టుబడి సాయం ఇవ్వలేము అని చెప్పారు. రైతుల హక్కులకు భంగం కలిగించవద్దన్నదే ప్రభుత్వ ఉద్దేశమని సీఎం అన్నారు. పామాయిల్ పంటలకు పెట్టుబడి సాయం ఇస్తామని సీఎం ప్రకటించారు. గిరిజన రైతులకు కూడా పంట పెట్టుబడి సాయం అమలు చేస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు.
తెలంగాణ వస్తే చిమ్మ చీకట్లు అలుముకుంటాయని ఉమ్మడి రాష్ట్రంలో పలువురు అపోహలు కల్పించారని కేసీఆర్ ఈ సందర్భంగా మండిపడ్డారు. తెలంగాణలో కరెంట్ పోయే ప్రశ్న రానివ్వమని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. బీజేపీ అధికారంలో ఉంటే కాంగ్రెస్ ధర్నా.. కాంగ్రెస్ అధికారంలో ఉంటే బీజేపీ ధర్నాలు చేయడం చూస్తూనే ఉన్నామని చెప్పారు. టీడీపీ కరెంట్ తేలేదు.. కాంగ్రెస్ కరెంట్ తేలేదు.. కరెంట్ తెచ్చింది గులాబీ జెండానే అని సీఎం స్పష్టం చేశారు. జాతీయ పార్టీలైన బీజేపీ - కాంగ్రెస్.. చిల్లర రాజకీయాలు మానుకోవాలని సూచించారు.