Begin typing your search above and press return to search.
ఏపీ గురించి కేసీఆర్ హాట్ కామెంట్స్.. ఏమన్నారంటే
By: Tupaki Desk | 9 March 2022 3:28 AM GMTఏపీ గురించి తెలంగాణ సీఎం కేసీఆర్.. మరోసారి.. హాట్ కామెంట్లు చేశారు. ఏపీలో సచివాలయం కూడా తెలంగాణలోని కలెక్టర్ మాదిరిగా లేదన్నారు. ఒకప్పుడు పాలమూరు ప్రాంతం నుంచి వలసలు ఉండేవని.. కానీ.. ఇప్పుడు ఏపీ నుంచి వచ్చి పాలమూరులో పనిచేస్తున్న వలస కూలీలు పెరుగుతున్నారని.. ఆయన వ్యాఖ్యానించారు.
అంతేకాదు, ఉమ్మడి పాలమూరు జిల్లాలో కరువు మాయమైందని సీఎం కేసీఆర్ అన్నారు. వనపర్తి జిల్లాలో పర్యటించిన సీఎం.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. సమీకృత కలెక్టరేట్ భవనం ప్రారంభం అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో పాల్గొన్నారు.
వనపర్తి మున్సిపాలిటీకి రూ.కోటి ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు. దాంతోపాటు జిల్లాలోని ఇతర మున్సిపాలిటీలకు రూ.50 లక్షలు, గ్రామాలకు రూ.20 లక్షల చొప్పున నిధులు మంజూరుచేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగానే ఏపీపై సటైర్లు పేల్చారు. జిల్లాల్లో ఎవరూ ఊహించని అభివృద్ధి జరుగుతోందని సీఎం కేసీఆర్ అన్నారు.
నా రాష్ట్రం, నా జిల్లా అనే తపన ఉంటే సత్ఫలితాలు వస్తాయని పేర్కొన్నారు. జిల్లా నుంచే 'మన ఊరు- మన బడి' కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీకారం చుట్టారు. అనంతరం టీఆర్ ఎస్ కార్యాలయం, సమీకృత కలెక్టర్ను ప్రారంభించారు.
వనపర్తి మున్సిపాలిటీకి రూ.కోటి ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు. దాంతోపాటు ఇతర మున్సిపాలిటీలకు రూ.50 లక్షలు, జిల్లాలోని గ్రామాలకు రూ.20 లక్షల చొప్పున నిధులు మంజూరుచేస్తున్నట్లు ప్రకటన చేశారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో కరువు మాయమైందన్నారు. మహిళలకు ఉమెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేశారు.
``కొన్ని రాష్ట్రాల్లో(ఏపీ) సచివాలయాలు కూడా మన కలెక్టరేట్లులా లేవని మన అధికారులు చెబుతున్నారు. జిల్లాలో కరవు మాయమై.. పంటలు పండుతున్నాయి. అద్భుతమైన రూపం వచ్చింది. దేశంలోని అనేక విషయాల్లో తెలంగాణ నంబర్ వన్ స్థానంలో ఉంది.
తలసరి విద్యుత్ వినియోగం, తలసరి వ్యక్తిగత ఆదాయంలో తెలంగాణ నంబర్ వన్. జీఎస్డీపీలో తెలంగాణ ముందువరసలో ఉంది. ఇంటింటికి నల్లా నీళ్లిచ్చే ఒకటే ఒక రాష్ట్రం తెలంగాణ. మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల కంటే గ్రోత్రేట్ తెలంగాణలోనే ఎక్కువ. వనపర్తిలో ఇంత అభివృద్ధి జరుగుతుందని ఎవరూ కలగనలే. వనపర్తి జిల్లా బంగారుపర్తి కావాలి.`` అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.