Begin typing your search above and press return to search.
పార్టీ నేతలకు కేసీఆర్ దసరా ధమాకా
By: Tupaki Desk | 9 Oct 2016 5:50 PM GMTఎవరిని ఎప్పుడు సంతోష పెట్టాలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు తెలిసినంత బాగా మరెవరికీ తెలీదేమో. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి దాదాపు రెండున్నరేళ్లు అవుతున్నా.. నామినేటెడ్ పదవుల పందేరానికి ఎంతకూ తెర తీయని ఆయన.. పండగ వేళ కొన్ని పదవుల్ని భర్తీ చేస్తూ తీసుకున్ నిర్ణయం దసరా థమాకా మారింది. ఎన్నోళ్ల నుంచో వెయిట్ చేస్తున్న నామినేటెడ్ పదవుల్ని భర్తీ చేస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.
కాస్తంత ఓపికతో ఎదురుచూస్తూ.. పార్టీ కోసం అహరహం కష్టపడే వారికి పార్టీ గుర్తింపు ఉంటుందని.. పదవులు పొందే అవకాశం ఉంటుందన్న సంకేతాన్ని ఇచ్చిన కేసీఆర్.. తొమ్మిది కార్పొరేషన్లకు ఛైర్మన్ పదవుల్ని భర్తీ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు బిజీలో ఉండి కూడా నామినేటెడ్ పదవుల భర్తీపై కీలక నిర్ణయం తీసుకున్న తీరు చూస్తే.. రాజు తలుచుకోవాలే కానీ.. వరాలు ఎప్పుడైనా.. ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఇవ్వగలరన్న విషయం ఇట్టే అర్థం కావటం ఖాయం.
ఇక.. తాజాగా ఎంపిక చేసిన కార్పొరేషన్ల ఛైర్మన్లను చూస్తే..
1. కుడా చైర్మన్: మర్రి యాదవ్ రెడ్డి
2. తెలంగాణ రాష్ట్ర ఐఐసీ చైర్మన్ : బాలమల్లు
3. తెలంగాణ రాష్ట్ర ఆగ్రో చైర్మన్ : లింగంపల్లి కృష్ణారావు
4. హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్: మందల శామ్యూల్
5. తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్: వెంకటేశ్వర్ రెడ్డి
6. సివిల్ సప్లయ్ కార్పొరేషన్ చైర్మన్ : పెద్ది సుదర్శన్ రెడ్డి
7. ఇరిగేషన్ డెవలప్‑మెంట్ కార్పొరేషన్ చైర్మన్: ఈద శంకర్‑రెడ్డి
8. ఫారెస్ట్ డెవలప్‑మెంట్ కార్పొరేషన్ చైర్మన్: బండ నరేందర్ రెడ్డి
9. షీప్ అండ్ గోట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్: రాజయ్య యాదవ్
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/