Begin typing your search above and press return to search.
ఢిల్లీ వెళ్తున్న కేసీయార్ జేబులో ఉన్న సీట్లెన్ని...?
By: Tupaki Desk | 16 Feb 2022 1:30 AM GMTకేసీయార్ మంచి దూకుడు మీద ఉన్నారు. తెలంగాణా రాజకీయం ఇక చాలు, జాతీయ రాజకీయాలే ఇక టార్గెట్ అని తనకు తానుగా చెప్పేసుకుని ఒట్టేసుకుని ముందుకు సాగుతున్నారు.
కేసీయార్ మంచి వ్యూహకర్త. దానికి మించి అదృష్టం కూడా ఆయనకు ఎపుడూ తోడు అవుతూ వస్తోంది. ఎవరికైనా అసాధ్యం అన్నది కేసీయార్ కి మాత్రం సుసాధ్యమవుతోంది. అది తెలంగాణా రాష్ట్ర సాధన అన్నది తెలిసిందే. 1969లో ఎందరో ఉద్ధండ రాజకీయ నాయకులు తెలంగాణా సాధన కోసం భారీ ఎత్తున ఉద్యమించారు.
అలాంటి వారు కూడా సాధించలేని తెలంగాణాను కేసీయార్ సాధించారు. దాని వెనక వ్యూహాలే ఎక్కువగా పనిచేశాయి. ఇక తెలుగు రాజకీయాల్లో ముందస్తు ఎన్నికలకు వెళ్ళి నెగ్గిన వాళ్ళు కూడా ఎవరూ లేరు.
అది కాంగ్రెస్ అయినా ఎంన్టీయార్ నుంచి చంద్రబాబు దాకా చూసుకున్నా ఓటమే పలుకరించింది. కానీ 2018లో కేసీయార్ ముందస్తు ఎన్నికలకు వెళ్లి మరోసారి తెలంగాణాలో విజయదుందుభి మోగించారు.
ఇపుడు ఆయన మరో బిగ్ టాస్క్ మీద కన్నేశారు. అదే జాతీయ రాజకీయాల్లో తెలుగు వెలుగుల కోసం. ఎన్టీయార్ నుంచి చంద్రబాబు దాకా తీసుకుంటే అక్కడ రాణించారు కానీ అనుకున్న పదవులు అయితే దక్కలేదు. ఇపుడు కేసీయార్ ఈ విషయంలో కూడా తాను విజేతను అవుతాను అని అంటున్నారు. ప్రస్తుతం దేశంలో వాతావరణం కూడా దానికి అనుకూలంగా ఉందని ఆయన భావిస్తున్నారు.
రేపటి రోజున కాంగ్రెస్ తప్పనిసరిగా ప్రాంతీయ పార్టీల కూటమికే మద్దతు ఇవ్వాల్సిన పరిస్థితులు ఉన్నాయి. దాంతో ప్రాంతీయ పార్టీ నేతలలో పోటీ చాలానే ఉంది. ఒక వైపు మమతా బెనర్జీ ప్రధాని రేసులో ముందుంటారు. ఆమె పశ్చిమ బెంగాల్ ను మూడవసారి పాలిస్తున్నారు. 2024 నాటికి ఆమె దేశ ప్రధాని కావాలనుకుంటున్నారు.
అలాగే మరో పోటీ అరవింద్ కేజ్రీవాల్ నుంచి కూడా ఉంది. ఆయన ఇప్పటికి రెండు సార్లు ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆప్ పార్టీని అటు పంజాబ్, ఇటు గోవాలతో పాటు అనేక చోట్ల విస్తరించారు. వీరితో పాటు కేసీయార్ పేరు ఇపుడు వినిపిస్తోంది. స్టాలిన్ అయితే తమిళనాడుకే పరిమితం అవుతారు. ఉద్ధవ్ థాకరే మహరాష్ట్ర రాజకీయాలకే కమిట్ అవుతారు.
ఈ నేపధ్యంలో ప్రాంతీయ పార్టీలన్నీ కూటమి కడితే కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీల మద్దతుతో 2024లో కేంద్రంలో యునైటెడ్ ఫ్రంట్ తరహా ప్రభుత్వం ఏర్పాటు అన్నది అసాధ్యం కాబోదు. అయితే ప్రధాని రేసులో నిలవాలి అంటే నంబర్ గేమ్ లో గెలవాలి. అంటే ఎంపీలు ఎవరికి ఎంతమంది ఉన్నారు అన్న దాని మీదనే ఇది ఆధారపడి ఉంటుంది.
అలా కనుక చూసుకుంటే మమతా బెనర్జీకి పశ్చిమ బెంగాల్ లో 42 ఎంపీ సీట్లు ఉన్నాయి. ఆమె గట్టిగా నలభై వరకూ గెలిస్తే తానే ప్రధాని అంటారు. అయితే ఆమె ఆధిపత్య ధోరణికి మిగిలిన పార్టీలు ఒప్పుకుంటాయా అన్నదే ప్రశ్న.
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఢిల్లీలోని ఏడు ఎంపీ సీట్లతో పాటు పంజాబ్, ఇతర చోట్ల ఎన్నో కొన్ని గెలిచి డబుల్ డిజిట్ చూపించినా ఆయన పూర్తి స్థాయి రాజకీయ నేత కారు, మాజీ బ్యూరోక్రాట్ అన్నది ఒక మైనస్ పాయింట్ గా ఉంటుంది.
ఇక కేసీయార్ ని తీసుకుంటే ఆయన సొంత రాష్ట్రం తెలంగాణాలో 17 ఎంపీ సీట్లు ఉన్నాయి. ఇవన్నీ గెలిచినా కూడా కేసీయార్ కి నంబర్ గేమ్ లో పోటీ తప్పదు, అపుడు తెలుగు రాష్ట్రం అయిన ఏపీ నుంచి జగన్ మద్దతు అవసరం అవుతుంది. అక్కడ పాతిక ఎంపీ సీట్లు ఉన్నాయి. అలాగే తమిళనాడు స్టాలిన్ నుంచి కూడా మద్దతు తీసుకుంటే అక్కడ 39 ఎంపీ సీట్లు ఉన్నాయి.
వీటితో పాటు కర్నాటక నుంచి దేవేగౌడ మద్దతు కూడా కేసీయార్ కి ఇపుడు లభిస్తోంది. అలాగే కేరళలో కమ్యూనిస్టు ప్రభుత్వం ఉంది. సౌత్ నుంచి ప్రధాని ఈసారి రావాలి అన్న నినాదాన్ని రగిలించినట్లు అయితే ఇక్కడ ఉన్న 125 సీట్లలో అత్యధికం కేసీయార్ వైపే ఉండడం ఖాయం.
ఇక ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ కూడా కేసీయార్ కి కీలక సమయాన మద్దతు పలికితే ఆయన నంబర్ గేమ్ లో సులువుగా గెలిచి దేశానికి ప్రధాని అయినా ఆశ్చర్యం లేదు అంటున్నారు. మొత్తానికి చూసుకుంటే ఇపుడున్న జాతీయ రాజకీయాలను బాగా పరిశీలిస్తున్న కేసీయార్ ఈసారి కూడా హిట్టే అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.