Begin typing your search above and press return to search.

మోడీతో కేసీఆర్ యుద్ధం.. కలిసి వచ్చే వారే లేరా?

By:  Tupaki Desk   |   17 April 2022 4:30 AM GMT
మోడీతో కేసీఆర్ యుద్ధం.. కలిసి వచ్చే వారే లేరా?
X
ఇప్పటివరకు దేశ ప్రధానులుగా పని చేసిన వారిలో ఎవరికి దక్కనంత అడ్వాంటేజ్ లు నరేంద్ర మోడీకే దక్కాయని చెప్పాలి. నాన్ స్టాప్ గా ఎనిమిదేళ్లుగా అధికారాన్ని చెలాయిస్తున్నా.. పలు కీలక అంశాల విషయంలో మోడీ పాలనపై ప్రజల్లో గుర్రు ఉన్నప్పటికీ.. ఆయనకు ప్రత్యామ్నాయం ఎవరూ లేని విచిత్రమైన పరిస్థితి ఇప్పుడుచోటు చేసుకుంది.

పెట్రోల్.. డీజిల్ ధరల మంటతో పాటు.. నిత్యవసర వస్తువులు ఎప్పుడూ లేనంత భారీగా పెరిగిపోవటం.. నిరుద్యోగంతో పాటు మోడీ హయంలో ఆర్థిక తిరోగమనంపై పెద్ద ఎత్తున విమర్శలు.. ఆరోపణలు ఉన్నాయి. అయినప్పటికీ ఆయనపై ప్రజల్లో పెరగాల్సినంత వ్యతిరేకత పెరగటం లేదన్న వాదన వినిపిస్తోంది.

ఇదిలా ఉంటే.. మోడీని తీవ్రంగా వ్యతిరేకించే ముఖ్యమంత్రుల్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఒకరు. నిజానికి ప్రధాని మోడీపై యుద్దం చేస్తున్నట్లుగా కేసీఆర్ ఇటీవల కాలంలో పేర్కొనటం తెలిసిందే. అందుకు తగ్గట్లే.. వరిని కొనని మోడీ సర్కారుపై వార్ డిక్లేర్ చేసిన ఆయన.. దేశ రాజధానిలో నిరసనను చేపట్టారు. మరేం అయ్యిందో కానీ.. హైదరాబాద్ కు తిరిగి వచ్చిన ఆయన.. రైతుల నుంచి వరిని తామే కొనుగోలు చేస్తామని ప్రకటించారే కానీ.. మోడీ సర్కారు మెడలు వంచుతామనే మాటను మాత్రం చేతల్లో చూపించలేకపోయారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఇటీవల కాలంలో దేశంలో చోటు చేసుకుంటున్న దారుణ పరిస్థితులపై తాజాగా గళం విప్పాయి 13 విపక్ష పార్టీలు. వారంతా కలిసి ఉమ్మడిగా ఒక లేఖను దేశ ప్రజలకు రాశారు. అందులో ప్రధాని మోడీపై విమర్శల వర్షం కురిపించారు. నిద్ర లేచింది మొదలు నరేంద్ర మోడీ దారుణ పాలనపై గళం విప్పుతానని.. దేశంలోని రాజకీయ పార్టీలను ఏకం చేస్తానని.. వ్యతిరేకుల కూటమిని నిర్మిస్తామని పెద్ద పెద్ద మాటలు చెప్పే కేసీఆర్..

తాజాగా మోడీకి వ్యతిరేకంగా విపక్షాలు రాసిన లేఖలో కేసీఆర్ పేరు లేకపోవటం దేనికి నిదర్శనం? అన్నది ప్రశ్న. సాధారణంగా ఎవరిమీదనైనా యుద్ధం ప్రకటించినప్పుడు.. వారి వ్యతిరేకులతో జత కలవటం.. వారి వ్యతిరేక కూటమిని ఒక్కటి చేయటం లాంటివి చేస్తారు.కానీ.. మోడీ వ్యతిరేకులతో సీఎం కేసీఆర్ జత కట్టకపోవటం ఒక ఎత్తు అయితే.. అలా జత కట్టిన టీంలోకి కేసీఆర్ కు చోటు లభించకపోవటం ఏమిటన్నది ప్రశ్న.

ఇదంతా చూస్తే.. మోడీతో యుద్దం చేస్తానని చెప్పే కేసీఆర్.. ఆ క్లిష్టమైన.. కష్టసాధ్యమైన పనిని సోలోగా చేస్తారన్న విషయం తాజా పరిణామంతో స్పష్టమైందని చెప్పాలి. మందిగా చేయలేని పనిని సోలోగా కేసీఆర్ చేస్తారా? అన్నది అసలు ప్రశ్న. దీనికి సీఎం కేసీఆర్ ఎప్పుడు బదులిస్తారో