Begin typing your search above and press return to search.
కేసీఆరా మజాకానా? కేసీఆర్ కు ఆ ప్రశ్న వేసే ధైర్యం చేయని మీడియా?
By: Tupaki Desk | 22 March 2020 12:30 PM GMTనిర్వహిస్తున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి.. తాజాగా మరో ప్రెస్ మీట్ పెట్టటం తెలిసిందే. ఈ మీడియా సమావేశంలో ఒక ఆసక్తికర అంశం కనిపించింది. రోటీన్ కు భిన్నంగా చోటు చేసుకున్న ఈ ఉదంతాన్ని చూస్తే.. మీడియా మీద తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కున్న పట్టు ఎలాంటిదన్న విషయం ఇట్టే అర్థమైపోతుంది.
ఎదుటి వ్యక్తి ఎవరు? అన్నది చూసుకోకుండా.. అడగాల్సిన ప్రశ్నను ఇట్టే అడిగేసే అవకాశం పాత్రికేయం ఇస్తుంటుంది. అలాంటి రిపోర్టర్లు ప్రశ్నాస్త్రాల్ని సంధించకుండా ఉండాలంటే ఏం చేయాలన్న విషయంలో సీఎం కేసీఆర్ కు మించినోళ్లు మరెవరూ ఉండరనే చెప్పాలి. శనివారం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసే సమయానికి తాను రంగంలోకి దిగిన ఎన్నికల్లో గెలుపు కోసం హైదరాబాద్ శివారులో భారీ పార్టీ నిర్వహిస్తుండటం.. దీనికి సంబంధించిన వీడియో ఒకటి బయటకు రావటం..కలకలం రేపటం లాంటివి తెలిసిందే.
మామూలుగా అయితే.. ఇదే అంశం వేరే నాయకుడి విషయంలో జరిగి ఉంటే.. మీడియా భేటీ మొత్తం దాని మీదనే నడిచేది. కానీ.. కేసీఆర్ సీన్లో ఉంటే అలాంటివేమీ ఉండవన్న విషయం మరోసారి రుజువైంది. సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ కు తోపుల్లాంటి రిపోర్టర్లు హాజరైనా.. వారంతా సారు చెప్పిన మాటల్ని బుద్ధిగా విన్నారు? ఆయన్ను అడగాల్సిన ప్రశ్నలు అడిగి.. సమాధానం రాబట్టుకున్నారే తప్పించి.. అనవసరంగా ఏ ఒక్కరూ కూడా కరోనా వేళ.. పెళ్లిళ్ల విషయంలోనే 200 మంది మించొద్దని మీరు చెప్పారు. మీ కుమార్తె అంత పెద్ద పార్టీ ఏర్పాటు చేశారే? అన్న ప్రశ్నను సూటిగా అడగటం కష్టమనుకుంటే.. నగర శివారులోని రిసార్టులో భారీ పార్టీ చేసుకుంటున్న వీడియోలు వచ్చాయి? వాటి సంగతేంటి? ఇలాంటి పార్టీల్ని ప్రభుత్వం.. పోలీసులు చూసిచూడనట్లుగా ఉండిపోతున్నారెందుకు? లాంటి ప్రశ్నల్ని సంధించని వైనం చూస్తే.. ఇలాంటివి కేసీఆర్ కు మాత్రమే సాధ్యమన్న భావన కలుగక మానదు.
సారును ఇరుకున పెట్టే ప్రశ్నలు సంధిస్తే.. ఆయన నోటి నుంచి వచ్చే మాటలకు భయపడ్డారా? కరోనా లాంటి సమయంలో.. తమ స్థాయికి తగ్గ ప్రశ్నలు వేయాలన్న ఉద్దేశంతో.. భారీ పార్టీ ప్రశ్నను స్కిప్ చేశారా? అన్న సందేహం రాక మానదు. ఏదైనా ప్రశ్నిస్తాం.. ఎవరినైనా నిలువరిస్తామంటూ మాటలు చెప్పే మీడియా సైతం.. ఇప్పుడు ఆచితూచి అన్నట్లుగా ప్రశ్నలు వేస్తున్న వైనం తాజా మీడియా సమావేశంలో కొట్టొచ్చినట్లుగా కనిపించిందనే చెప్పాలి.