Begin typing your search above and press return to search.

కేసీఆర్ ఫైర్: ఆ పత్రిక తీరుపై ఆవేదన - వార్నింగ్

By:  Tupaki Desk   |   7 April 2020 5:50 AM GMT
కేసీఆర్ ఫైర్: ఆ పత్రిక తీరుపై ఆవేదన - వార్నింగ్
X
తెలంగాణ సీఎం కేసీఆర్ తనలోని ఆవేదనను - ఆగ్రహాన్ని కర్రవిరగకుండా పాము (తెలుగుప్రధాన పత్రిక) చచ్చేలా చెప్పిన తీరు చర్చనీయాంశమైంది. నిన్నటి విలేకరుల సమావేశంలో కేసీఆర్.. కరోనాపై పోరాడుతున్న తెలంగాణ వైద్యులకు కనీస వసతులు లేవంటూ వార్త రాసిన తెలుగు ప్రధాన పత్రికను చీల్చిచెండాడాడు. ఓరకంగా హెచ్చరికను జారీ చేశారు. ఆ పత్రికకు.. నడిపించటోనికి కరోనా తగలాలి అంటూ శపించారు. కేసు వేస్తానని.. పత్రికను వదిలే ప్రసక్తే లేదని.. కేసీఆర్ చెబితే ఎంత ఖతర్నాక్ గా ఉంటుందో నిరూపిస్తానని సవాల్ చేశారు.

తెలంగాణలోని ప్రధాన పత్రిక చంద్రబాబు కు అనుకూలంగా.. కేసీఆర్ కు మొదటి నుంచి వ్యతిరేకంగానే ఉంటూ వస్తోంది. ఇన్నాళ్లు పత్రికను సహించిన కేసీఆర్ కరోనా వంటి ఆపత్కాలం వేళ.. తెలంగాణ వైద్యులకు భరోసానివ్వకుండా వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా వసతులు లేవని రాయడంపై ఉగ్రరూపం దాల్చారు. పత్రికను - యాజమాన్యాన్ని బండ బూతులు తిట్టారు.

తన మార్క్ స్టైల్లో ఘాటు పదాలు వాడుతూ.. టెర్రిస్టులా తయారయ్యావ్ అంటూ పత్రిక యజమానిపై నిపులు చెరిగారు. కరోనాకు వ్యతిరేకంగా రాసిన ఆ మీడియాను వదిలిపెట్టను.. అంటూ కేసీఆర్ చెప్పాడంటే ఖతర్నాక్ ఉంటదని పెద్ద హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుతానికి కరోనా మీద దృష్టిపెట్టినా.. ఆ మీడియా పని పడతాం.. అస్సలు వదిలేయం అంటూ హెచ్చరించడం మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

కేసీఆర్ నోటివెంట ఓ మీడియాపై అంతసేపు మాట్లాడడం అదే తొలిసారి.. చిల్లరగాళ్లు - దుర్మార్గులు లాంటి పదాలు వాడి కడిగేశాడు. కరోనా వస్తే వాళ్లకు ఈ బాధ తెలుస్తుందని.. యాక్షన్ తీసుకుంటామని.. కేసు కూడా వేస్తామని.. ఇలాగే కొనసాగితే శిక్ష తప్పదంటూ హెచ్చరించారు. మీడియానే కాదు.. ఎవ్వరూ సరైన వివరణ తీసుకోకుండా రాస్తే మీడియాకు శిక్ష తప్పదని.. అసత్యాలు ప్రచారం చేస్తున్నారో వాళ్లను మీడియా దూరంగా పెట్టాలని మీడియాను కేసీఆర్ కోరారు.