Begin typing your search above and press return to search.
మోదీపై కేసీఆర్ ఆగ్రహం: కేంద్రానిది బోగస్, దుర్మార్గపు ప్యాకేజీ అని మండిపాటు
By: Tupaki Desk | 19 May 2020 3:30 AM GMTఆత్మ నిర్భర భారత్ అంటూ కేంద్రం ప్రకటించిన రూ.20 కోట్ల భారీ ప్యాకేజీపై తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ప్యాకేజీ బోగస్, దుర్మార్గపు ప్యాకేజీగా మండిపడ్డారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. మంత్రివర్గ సమావేశం అనంతరం సోమవారం రాత్రి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మొదటి నుంచి కేసీఆర్ కొంత సీరియస్‌గా ఉన్నారు. సమావేశంలో మంత్రివర్గ సమావేశ నిర్ణయాలు చెప్పి వెళ్దామనుకున్న సమయంలో విలేకరులు కేంద్ర ప్యాకేజీపై ప్రశ్నించారు. దీంతో ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. కేంద్ర ప్రభుత్వంపై, ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
ఆర్థిక ప్యాకేజీని బోగస్ ప్యాకేజీగా అభివర్ణిస్తూనే ఆర్థిక ప్యాకేజీ ఫ్యూడల్ విధానంలో భాగంగా ఉందని, ఫెడరల్ రాజ్యమైన భారతదేశంలో అది ఎలా అతుకుతుందని ప్రశ్నించారు. ఆ ప్యాకేజీని విపక్షాలే కాకుండా విదేశాలు కూడా తూర్పారబడుతున్నాయని తెలిపారు. ఈ ప్యాకేజీలో కేంద్రం తనదైన ఫ్యూడల్ వైఖరిని బయటపెట్టుకుని తన పరువును తానే తీసుకుందని పేర్కొన్నారు. ప్యాకేజీలో దేశంలోని రాష్ట్రాలను కేంద్రంలోని మోదీ సర్కారు బిక్షగాళ్లలా చూసిందని కూడా కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మొత్తంగా కేంద్రం ప్యాకేజీ… ఓ దుర్మార్గపు ప్యాకేజీనేనని కేసీఆర్ విరుచుకుపడ్డారు.
కరోనా నేపథ్యంలో కేంద్రం నుంచి రాష్ట్రాలు కోరుకున్నది ఫ్యూడల్ తరహా ప్యాకేజీ కాదని, కానీ అలాంటిదే ఇచ్చిందని తెలిపారు. రాష్ట్రాల చేతుల్లోకి నగదు వచ్చేలా ప్యాకేజీలు ఉండాలని భావించినట్లు చెప్పారు. దానికి విరుద్ధంగా నరేంద్ర మోదీ సర్కారు ఫ్యూడల్ భావజాలమున్న ప్యాకేజీని ప్రకటించిందని అసహనం వ్యక్తం చేశారు. కేంద్రం అనుసరిస్తున్న విధానాలతో దేశంలోని అన్ని వ్యవస్థలు ప్రైవేట్ పరం కాక తప్పదని వెల్లడించారు. రాష్ట్రాల నుంచి కేంద్రం సెస్‌ల రూపంలో పన్నులు వసూలు చేస్తోందని, కేంద్రం వైఖరితో రాష్ట్రాలు మునిగిపోక తప్పదని జోస్యం చెప్పారు.