Begin typing your search above and press return to search.

సీఎంకి సారీ చెప్పిన గులాబీ నేతలు ..ఎందుకంటే !

By:  Tupaki Desk   |   9 Jan 2020 9:36 AM GMT
సీఎంకి సారీ చెప్పిన గులాబీ నేతలు ..ఎందుకంటే  !
X
తెలంగాణ లో మున్సిపల్ ఎన్నికల నగారా మోగడంతో తెలంగాణ నేతలంతా బిజీ బిజీ గా గడుపుతున్నారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.వనపర్తి, మహబూబ్‌నగర్ మున్సిపాలిటీలు సహా కరీంనగర్ కార్పొరేషన్‌లో పలు డివిజన్లలో ఎన్నికలపై స్టే విధించింది. ఎన్నికలను ఆపాలంటూ టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సహా పలువురు నేతలు దాఖలు చేసిన పిటిషన్లను కొట్టి వేస్తూ ఎన్నికలు నిర్వహించాలని ఆదేశాలు జారీచేసింది.

ఈ నేపథ్యం లో తెలంగాణ సీఎం కేసీఆర్ ..పార్టీ మంత్రులు , ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీ లు, నియోజకవర్గ సమన్వయకర్తలతో గురువారం సమావేశం ఏర్పాటు చేసారు. మునిసిపల్ ఎన్నికలపై చర్చించేందుకు, దిశా నిర్దేశం చేసేందుకు నేడు తెలంగాణ భవన్‌లో ఈ సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. అయితే , ఈ సమీక్షా సమావేశానికి సీఎం వచ్చిన కొద్దిసేపటి తరువాత కొంతమంది నేతలు ,మంత్రులు తాపీగా రావడం ప్రారంభించారట . దీనితో సీఎం కేసీఆర్ వారి పై సీరియస్ అయ్యారట. అసలు సమయ పాలన లేకపోతె చాలా కష్టం అని వార్నింగ్ ఇచ్చారట. కీలకమైన మునిసిపల్ ఎన్నికలకు సంబంధించిన విషయం పై సమావేశం అని తెలిసినప్పటి కూడా ఇదేనా మీ నిబద్దత అంటూ ప్రశ్నించారట, అలాగే ఇదేనా మీరు సీఎంకు ఇచ్చే గౌరవం అంటూ ఫైర్ అయ్యారని సమాచారం. దీంతో లేటుగా వచ్చిన నేతలందరూ మరోసారి ఇలా రీపీట్ కాదంటూ సారీ చెప్పారని తెలుస్తోంది.