Begin typing your search above and press return to search.
తమ్ముడు.. అంటూ తీవ్రమైన వార్నింగ్ ఇచ్చిన కేసీఆర్
By: Tupaki Desk | 19 May 2020 4:30 AM GMTదేశంలో ఇంతమంది ముఖ్యమంత్రులు ఉన్నా.. మరెవరికీ లేని ఇమేజ్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సొంతమని చెప్పాలి. సాధారణంగా ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ అంటే.. పెద్ద ఆసక్తిని ప్రదర్శించరు. అందుకు భిన్నంగా రాష్ట్రాలకు అతీతంగా తెలుగువారంతా సారు ప్రెస్ మీట్ అంటే చాలు.. అలెర్టు అయిపోతారు. తాము రెగ్యులర్ గా ఫాలో అయ్యే ప్రోగ్రాంలను పక్కన పెట్టేసి.. ఏం చెబుతారన్న ఆసక్తి వ్యక్తమవుతోంది.
తాజాగా నిర్వహించిన ప్రెస్ మీట్ లో.. ఒక మీడియా ప్రతినిధిపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి. ఎందుకంత ఆగ్రహం ఆయనకు వచ్చింది? అన్నది ఆసక్తికరంగా మారింది. ఇంతకూ సదరు మీడియా ప్రతినిధి ఏ ప్రశ్న వేసినందుకు అంతలా కాలిందన్నది ఆసక్తికరంగా మారింది. కేసీఆర్ కు కాలేలా ప్రశ్న్ వేయటమే కాదు.. చివరకు ఆయన నోటి నుంచి తీవ్రమైన వార్నింగ్ ను ఎదుర్కొన్నారు.
ఇంతకీ ఆ జర్నలిస్టు సంధించిన సందేహం ఏమంటే? పోతిరెడ్డి పాటు మీద కేంద్ర జోక్యం కోరుకుంటారా? అని ప్రశ్నించారు. దీనికి స్పందించిన కేసీఆర్.. తమ్ముడు.. నీకు కిరికిరి పంచాయితీ పెట్టాలని ఉన్నట్టుంది. అదేమీ జరగదు.. దురాశపడకు.. ఇక చాలు. నీ ఉద్దేశం ఏమిటో అర్థమైోతోంది. నువ్వు కేసీఆర్ తో పెట్టుకోలేవు అంటూ విరుచుకుపడ్డారు. ఇంతకూ సదరు మీడియా ప్రతినిధి ఎవరు? ఏ మీడియా సంస్థకు చెందిన వారన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.
సీఎం కేసీఆర్ కు కాలేలా ప్రశ్నను సంధించిన సదరు విలేకరి.. ప్రధాన మీడియా సంస్థకు చెందిన వ్యక్తి కాదని చెబుతున్నారు. చిన్న పత్రికకు సంబంధించిన ఆ విలేకరికి తీవ్రమైన హెచ్చరికను స్వయంగా జారీ చేశారు. చిక్కు ప్రశ్నకు సమాధానం చెప్పకుండా చెలరేగి పోవటమే కాదు.. ఆ అంశం నుంచి అందరి చూపు పక్కకు మళ్లేలా చేయటంలో సారుకు మించినోళ్లు లేరనే చెప్పక తప్పదు.