Begin typing your search above and press return to search.
హెలికాఫ్టర్ జర్నీలో కేసీఆర్ కు ‘సీన్’ అర్థమై సీరియస్ అయ్యారుగా
By: Tupaki Desk | 22 May 2021 4:30 AM GMTఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నిత్యం ప్రజల మధ్య ఉంటే.. అదే పనిగా ఒక చోటు నుంచి మరోచోటుకు తిరుగుతూ ఉంటే? గ్రౌండ్ లెవెల్ లో పరిస్థితుల గురించి నిఘా వర్గాలు ఫీడ్ బ్యాక్ ఇవ్వాల్సిన అవసరం లేదు. తన కళ్ల ముందు కనిపించే వాటితోనే అసలేం జరుగుతుందో ఇట్టే అర్థమవుతుంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఉన్న ఒకే ఒక్క సమస్య.. ఆయన ప్రజల మధ్యకు రాకపోవటం.. అందరికి దూరంగా.. తనదైన ప్రపంచానికే పరిమితం కావటం. ఎప్పుడో ఏదో అనిపిస్తే మాత్రం.. బయటకు వస్తుంటారు. అలా వచ్చినా పరిమితంగా.. తను కోరుకున్న వారిని మాత్రమే తన వద్దకు వచ్చేలా చేసుకున్న వ్యవస్థ పుణ్యమా అని.. గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది? ఏం చేస్తే.. మార్పు వస్తుందన్న విషయంపై ఆయన తరచూ నిఘా వర్గాలు ఇచ్చే రిపోర్టు మీద ఆధారపడుతుంటారు.
అయితే.. వాటిని పక్కన పెట్టేసి.. కాలికి బలపం కట్టుకొని తిరిగినట్లు కాకుండా.. వారానికి ఒకట్రెండుసార్లు బయటకు వచ్చి తిరిగే.. వ్యవస్థలోని పరిస్థితులు ఎంతలా మారతాయటానికి నిదర్శనంగా తాజా వరంగల్ ట్రిప్ ను చెప్పాలి. వరంగల్ పర్యటన కోసం ఫాంహౌస్ నుంచి హెలికాప్టర్ లో వెళ్లిన ఆయన.. తన ప్రయాణ సమయంలో ఒక విషయాన్ని గుర్తించారు. ఆసుపత్రిని సందర్శించిన తర్వాత.. డీజీపీ..జిల్లా కలెక్టర్లతో పాటు కమిషనర్లు.. ఎస్పీలతో ఆన్ లైన్ లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ధాన్యం సేకరణను మరింత వేగవంతం చేయాలని ఆదేశించారు.
తాను వరంగల్ కు హెలికాఫ్టర్ లో వస్తున్న వేళ రోడ్ల మీద వడ్ల కుప్పలు ఆరబోసి కనిపించాయి.. నాలుగైదు రోజుల్లో రోహిణి కార్తె పూర్తి కానున్న వేళ.. రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమవుతారని.. ధాన్యం సేకరణ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలన్నారు. ఇదే విషయాన్ని గడిచిన కొద్దిరోజులుగా మీడియా నెత్తి నోరు కొట్టుకుంది. ధాన్యం సేకరణ మీద ప్రభుత్వం చేస్తున్న బడాయి ప్రకటనలకు.. వాస్తవానికి మధ్య అంతరం ఎక్కువగా ఉందని రిపోర్టులు పేర్కొన్నాయి. ధాన్యం సేకరణకు ప్రభుత్వం మరింత వేగవంతంగా వ్యవహరించాలన్న మాట చెబితే సారుకు పట్టలేదు. తన కళ్లతో ధాన్యపురాశులు రోడ్ల మీద కనిపించేసరికి.. సారుకు సురుకు పుట్టింది.. అధికారులు పరుగులు తీసేలా ఆదేశాలుజారీ చేశారు. అందుకే.. వారానికి ఒకట్రెండు సార్లు సీఎం కేసీఆర్ అలా హెలికాఫ్టర్ లో రెండు రౌండ్లు కొడితే రాష్ట్రానికి చాలా మంచి జరుగుతుందనిపించట్లేదు?