Begin typing your search above and press return to search.
ఇంకో రికార్డుకు సిద్ధమవుతున్న కేసీఆర్
By: Tupaki Desk | 4 Feb 2018 8:57 AM GMTఔను! కొన్ని ఆలోచనలు - హామీలు - ఆచరణలు చూస్తుంటే...ఇలాంటివి టీఆర్ ఎస్ అధినేత - తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు మాత్రమే సాధ్యమమని అనిపిస్తుంది. మిగతా పాలకులు - నాయకులు ఆలోచన చేయలేని కేసీఆర్ మొదలుపెట్టేస్తుంటారు...ఆచరణకు సిద్ధమవుతుంటారు. అది కూడా రికార్డు స్థాయిలో. అలాంటి ప్రత్యేకతలు ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఖాతాలో కొన్ని ఉన్నాయి. అదే జాబితాలో తాజాగా మరో అంశం చేరింది. అదే కంటిపరీక్షలు.
కంటి పరీక్ష అనగానే...గతంలో కేసీఆర్ కు జరిగిన కంటిపరీక్ష అని భావించకండి. ఆయన రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించబోయే కంటిపరీక్ష. ఔను. రాష్ట్రవ్యాప్తంగా కేసీఆర్ కంటిపరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షలే కాదు..ఉచితంగా కళ్లద్దాలు కూడా ఇవ్వనున్నారు. మంత్రులు - ఎంపీలు - ప్రభుత్వ ప్రధాన సలహాదారు - ప్రభుత్వ ఆర్థిక సలహాదారు - ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి - ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి - సీఎంవో అధికారులతో ప్రగతి భవన్ లో నిర్వహించిన సమావేశంలో సీఎం కేసీఆర్ ఈ విషయాన్ని ప్రకటించారు.
రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నేత్ర శిబిరాలను నిర్వహించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. గ్రామీణ ప్రజలందరికీ ఈ శిబిరాల్లో ఉచితంగా కండ్ల పరీక్షలను నిర్వహించి, అవసరమైనవారికి ఉచితంగా కండ్లద్దాలు ఇవ్వాలని వైద్యాధికారులను ఆదేశించారు. అనేక కారణాలనవల్ల గ్రామీణ ప్రజల్లో కండ్లకు సంబంధించిన సమస్యలు చాలా తీవ్రంగా ఉన్నందువల్ల ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న ఈ నేత్ర శిబిరాలను ఎంపీలు - ఎమ్యెల్యేలు - ఎన్నికైన ఇతర ప్రజాప్రతినిధులు పర్యవేక్షించాలని, పెద్ద ఎత్తున జరుగనున్న ఈ కార్యక్రమంలో వారంతా భాగస్వాములు కావాలని సీఎం కేసీఆర్ కోరారు. రాష్ట్రంలో పనిచేస్తున్న నేత్ర వైద్య నిపుణులతో సహా అవసరమైతే పొరుగు రాష్ర్టాల్లో పనిచేస్తున్న వైద్య నిపుణుల సేవలను కూడా నేత్ర శిబిరాల నిర్వహణలో ఉపయోగించుకోవాలని సీఎం కేసీఆర్ వైద్యాధికారులను ఆదేశించారు.