Begin typing your search above and press return to search.
పండుగపూట కేసీఆర్ నాలుగున్నర గంటలు అలా గడిపారు
By: Tupaki Desk | 15 April 2019 5:09 AM GMTపండుగ ప్లస్ ఆదివారం వస్తే ఏం చేస్తాం? డబుల్ థమాకా అన్నట్లుగా బిజీబిజీగా గడిపేస్తాం. ఎంతంటే.. పక్కరోజు ఆఫీసుకు వెళ్లే సమయానికి అబ్బా.. ఆఫీసుకు వెళ్లాలా? బాగా అలిసిపోయామే అన్నట్లుగా ఉంటుంది సగటుజీవి డే షెడ్యూల్. మరి.. ఇలాంటి రోజున ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి డే షెడ్యూల్ ఎలా ఉంటుందంటే.. బయటకు రావటమే ఉండదు. ఒకవేళ వస్తే.. ఆ పండక్కి సంబంధించిన కార్యక్రమంలో పాల్గొనటం జరుగుతుంది.
అందరిలా చేస్తే ఆయన కేసీఆర్ ఎందుకు అవుతారు? అదెలా అంటారా? నిన్న ఆదివారం మాత్రమే కాదు.. శ్రీరామనవమి ప్లస్ అంబేడ్కర్ జయంతి. ఇలాంటి రోజున ఏ ముఖ్యమంత్రి అయినా.. అంబేడ్కర్ విగ్రహానికి పూలదండ వేసి.. నివాళులు అర్పించటం.. దానికి సంబంధించిన కార్యక్రమంలో పాల్గొంటారు. శ్రీరామనవమి అన్నంతనే.. ముఖ్యమంత్రి భద్రాచలానికి వెళ్లి ముత్యాల తలంబ్రాలు.. పట్టువస్త్రాలు సమర్పించి వస్తారు. కానీ.. సీఎం కేసీఆర్ మాత్రం ఇవేమీ చేయలేదు.
అందరి ఊహలకు భిన్నంగా ఆయనేం చేశారో తెలుసా? గవర్నర్ నరసింహన్ ను కలిశారు. దాదాపు మూడున్నర గంటల పాటు ఆయనతో సమావేశమయ్యారు. తర్వాతి రాత్రి వేళ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిని మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఇందుకోసం మరో గంట వెచ్చించారు. ఈ రెండు మీటింగ్స్ సందర్భంగా ఏం మాట్లాడుకున్నారు? లాంటివి పట్టించుకోవాల్సిన అవసరం లేదు.
కానీ.. కేసీఆర్ లాంటి ముఖ్యమంత్రి ప్రాధామ్యాలు ఎలా ఉంటాయన్నది తాజా ఎపిసోడ్ చూస్తే ఇట్టే అర్థమైపోతుంది. నిజానికి ఈ రెండు కార్యక్రమాలకు సంబంధించిన ఫోటోలు.. సమాచారం బయటకు వచ్చాయి కాబట్టి.. ఆయన ఈ రెండు భేటీల కోసం ఎంత సమయాన్ని వెచ్చించారో అర్థమవుతుంది. ఇదే సమాచారం బయటకు రాకుంటే.. పండుగ పూట ఆయనేం చేయకుండా ఉన్నారన్న భావన కలుగుతుంది. జనం ఏదో అనుకుంటారన్న లాంటి వాటిని లైట్ తీసుకుంటూ.. తన ఎజెండాకు తగ్గట్లు వెళ్లే కేసీఆర్ రూటు సపరేటు అని చెప్పాలి. కేసీఆర్ లాంటి ముఖ్యమంత్రులు అరుదుగా ఉంటారని చెప్పక తప్పదు.