Begin typing your search above and press return to search.
కేసీఆర్ భద్రాద్రికి రాలేదెందుకు?
By: Tupaki Desk | 5 April 2017 5:39 PM GMTశ్రీరామనవమి వస్తుందంటే చాలు.. ఆ సందడే వేరుగా ఉండేది. అయితే.. అదంతా ఓ ఇరవైఏళ్ల కిందట. మారిన కాలానికి తగ్గట్లే ఈ పండగ చేసుకోవటంలో మార్పు వచ్చిందని చెప్పక తప్పదు. మిగిలిన పండగలతో పోలిస్తే.. ఈ పండక్కి ఇస్తున్న ప్రాధాన్యత అంతకంతకూ తగ్గుతుందనే చెప్పాలి. అయితే.. రాములోరి ఇస్పెషల్ గుళ్లల్లో మాత్రం ఈ రోజుకీ అంగరంగ వైభవంగా రాములోరి కల్యాణ మహోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. అలాబ్రహ్మాండంగా రాములోరి కల్యాణాల్ని నిర్వహించే దేవాలయాల్లో తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి ఒకటి.
చారిత్రక విశిష్ఠత ఉన్న భద్రాద్రిలో జరిగే రాములోరి కల్యాణానికి ప్రభుత్వం తరఫున ముత్యాలు.. పట్టువస్త్రాల్ని ప్రత్యేకంగా సమర్పిస్తుంటారు. ఇందుకోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఉమ్మడి రాష్ట్రంలో ఈ పండగ సందర్భంగా ముఖ్యమంత్రి ముత్యాల తలంబ్రాలు.. పట్టువస్త్రాలు పట్టుకొని వస్తుంటే.. అందరూ ఎంతో ఆసక్తి వ్యక్తమయ్యేది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత.. ప్రాంతాల వారీగా విడిపోయిన నేపథ్యంలో తెలుగు ప్రజల అటెన్షన్ కాస్త డైవర్ట్ అయ్యిందని చెప్పక తప్పదు.
రాములోరి కల్యాణానికి ఎంత బిజీ ఉన్నా.. మరే కారణం ఉన్నా.. ముత్యాల తలంబ్రాలు.. పట్టువస్త్రాలు సీఎం సాబ్ పట్టుకు రావటం ఆనవాయితీ. కానీ.. ఈసారి మాత్రం అందుకు భిన్నమైన సీన్ ఎదురైంది. స్వల్ప అనారోగ్యం కారణంగా సీఎం కేసీఆర్ స్వామివారి కల్యాణమహోత్సవానికి రాలేదు. స్వల్ప అనారోగ్యమే కారణమైతే.. ముత్యాల తలంబ్రాలు.. పట్టువస్త్రాలు పట్టుకు రావటం అంత కష్టమవుతదా? అన్నది ప్రశ్న. కేసీఆర్ రాకున్నా.. ఆయన సతీమణి.. ఆయన మనమడు తదితరులు వచ్చేశారు.
కేసీఆర్ స్థానే.. ప్రభుత్వం తరఫున ముత్యాల తలంబ్రాలు.. పట్టువస్త్రాల్ని దేవాదాయశాఖామంత్రి ఇంద్రకరణ్ రెడ్డి స్వామివారికి అందజేశారు. ఈ మధ్యన కేసీఆర్ కు జలుబు విపరీతంగా వేధిస్తోందని చెబుతున్నారు. తాజాగా.. జ్వరం కూడా ఉండటంతో ఆయన నీరసంగా ఉన్నారని అందుకే స్వామివారి కల్యాణానికి రాలేదని చెబుతున్నారు. మొన్నన ఉగాది రోజున గవర్నర్ దంపతులు నిర్వహించిన కార్యక్రమానికి వచ్చిన కేసీఆర్.. అనారోగ్యం కారణంగా కొద్దిసేపటికే వెళ్లిపోవటం తెలిసిందే. తాజాగా రాములోరి కల్యాణానికి అస్సలు రాకపోవటం పలువురిని నిరాశకు గురి చేసిందని చెప్పక తప్పదు. ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖామంత్రి పట్టువస్త్రాల్ని అధికారికంగా సమర్పిస్తే.. సీఎం కేసీఆర్ కుటుంబం తరఫు మాత్రం.. ఆయన ముద్దుల మనమడు.. మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్ష్ పట్టువస్త్రాల్ని సమర్పించటం విశేషం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/