Begin typing your search above and press return to search.
వాసాలమర్రి సర్పంచ్ ను కారు ఎక్కించుకున్న సీఎం.. ఎంపీసీటీ మాత్రం అరెస్టు ఎందుకు?
By: Tupaki Desk | 26 April 2022 2:30 PM GMTఅధికారానికి ‘జై’ కొడితే సాదర స్వాగతం.. తప్పును ఎత్తి చూపిస్తే పోలీసుల అదుపులో. ఉద్యమనేత ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో సొంత పార్టీకి చెందిన ఇద్దరు స్థానిక నేతలకు ఒకేరోజు ఎదురైన అనుభవం చూస్తే.. ఆసక్తికరంగానే కాదు.. ఎన్నో విషయాలు ఇట్టే అర్థమయ్యేలా చేస్తాయి. వాసాలమర్రి ఊరిపేరు గుర్తుంది కదా? ఫాంహౌస్ నుంచి యాదాద్రికి వెళ్లే దారిలో ఉంటుందీ ఊరు. ఈ ఊరును సీఎం కేసీఆర్ ఏరి కోరి దత్తత తీసుకోవటం.. తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశ పెట్టిన దళితబంధు కార్యక్రమాన్ని ఈ ఊరి నుంచే షురూ చేసిన సంగతి తెలిసిందే.
సోమవారం ఏం జరిగిందంటే.. యాదాద్రి కొండ మీద ఏర్పాటు చేసిన అనుబంధ ఆలయమైన పర్వతవర్ధినీ సమేత రామలింగేశ్వరస్వామి దేవాలయ ఉద్ఘాటన.. మహాకుంభాభిషేకం ఉత్సవాలు వైభవంగా జరిగాయి. నిజానికి ఈ వేడుకలు ఈ నెల 20 నుంచి సాగుతున్నాయి. చివరి రోజున కావటంతో సీఎం కేసీఆర్ స్వయంగా హాజరయ్యారు. కేసీఆర్ తో పాటు ఆయన సతీమణి కూడా ఉన్నారు. శ్రీరామలింగేశ్వర స్ఫటికలింగ ప్రతిష్ఠా మహోత్సవం, మహాకుంభాభిషేక మహోత్సవం నిర్వహించారు. శివాలయం పునర్నిర్మాణ శిల్పి బాలసుబ్రహ్మణ్యంను సన్మానించటమే కాదు బంగారు కంకణాన్ని ఆయన చేతికి తొడిగారు. పూర్ణాహుతి కార్యక్రమాన్ని పూర్తి చేశారు.
ఇదంతా ఒక ఎత్తు.. దీనికి అనుబంధంగా మరోసీన్ చోటు చేసుకుంది. అదే ఈ కథనంలో కీలకమైనది. యాదగిరి గుట్ట ఆలయానికి చేరుకునేందుకు వెళుతున్న సీఎం కాన్వాయ్.. వాసాలమర్రి వద్ద ఆగటం.. సీఎం తన కారులో వాసాలమర్రి సర్పంచ్ పోగుల ఆంజనేయుల్ని తన వెహకిల్ లో ఎక్కించుకున్నారు. మరోవైపు.. టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎంపీటీసీతో సహా 13 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరంతా కూడా వాసాలమర్రికి చెందిన వారే. అదేంది? సర్పంచ్ ను సీఎం కారులో ఎక్కించుకున్నప్పుడు..అందుకు భిన్నంగా ఎంపీటీసిని పోలీసులు అదుపులోకి తీసుకోవటం ఏమిటన్న సందేహం రావొచ్చు.
కారణం ఏమంటే.. వాసాలమర్రి ఊరు రూపురేఖలు మార్చటం కోసం భారీ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. మంచిదే కానీ.. ఆ క్రమంలో వేసే రోడ్డు కారణంగా గ్రామంలోని ఆలయం.. స్కూల్ కూడా తొలగించాల్సి వస్తోంది. ఎంపీటీసీతో పాటు 13 మంది టీఆర్ఎస్ నేతల డిమాండ్ ఏమంటే.. గ్రామంలో రోడ్డు కోసం బడి.. గుడిని తొలగించకుండా రోడ్డు వేస్తే సరిపోతుంది కదా? అన్నది వారి వాదన. ఇదే విషయాన్ని సీఎం కేసీఆర్ కు చెప్పాలని.. అవసరమైతే నిరసన చేపట్టాలని వారు డిసైడ్ అయ్యారు. అయితే.. సదరు ఎంపీటీసీ.. ఇతర టీఆర్ఎస్ నేతలు సీఎం కాన్వాయ్ ను అడ్డుకుంటారని భావించి.. వారిని ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు.
ఇక్కడ చెప్పేదేంటే.. పెద్ద సారు ఏం చెబితే అందుకు సరి.. అనే స్థానిక నేతకు సీఎం కారులో కూర్చునే అవకాశం లభిస్తే.. అందుకు భిన్నంగా ఊరు ఎదుర్కొనే సమస్యను ముఖ్యమంత్రి వారికి చెప్పాలని తపించినందుకు పోలీసులు అదుపులోకి వెళ్లాల్సి వచ్చింది. అధికారానికి అనువుగా సాగిపోతే దక్కే గౌరవానికి.. అందుకు భిన్నంగా ప్రశ్నించాలన్న ప్రయత్నానికి ఎదురయ్యే సవాళ్లు ఎలా ఉంటాయనటానికి ఇదో చక్కటి ఉదాహరణగా చెప్పొచ్చు. ఇంత చిన్న విషయంలోనే ఇంత తేడా ఉంటే.. మిగిలిన వాటి సంగతేంటి? అన్నది అసలు ప్రశ్న.