Begin typing your search above and press return to search.

కేసీఆర్ ఫోన్ కు పాజిటివ్ గా ఓకే చెప్పిన సీఎం!

By:  Tupaki Desk   |   3 May 2019 8:33 AM GMT
కేసీఆర్ ఫోన్ కు పాజిటివ్ గా ఓకే చెప్పిన సీఎం!
X
తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప‌లుకుబ‌డి ఎంతన్న విష‌యాన్ని చెప్పే ఘ‌ట‌న ఒక‌టి తాజాగా చోటు చేసుకుంది. ఉమ్మ‌డి రాష్ట్రంలో ఉన్న‌ప్పుడు.. ఇరుగుపొరుగు రాష్ట్రాల‌తో నీళ్ల పంచాయితీ ఉండ‌టం.. ఏపీ ప్ర‌యోజ‌నాల్ని దెబ్బ తీసేలా వ‌రుస పెట్టి ప‌రిణామాలు చోటు చేసుకునేవి. మ‌న వాద‌న‌ను ఇరుగుపొరుగు వారు పెద్ద‌గా ప‌ట్టించుకునే వారు కాదు.

కాలం ఎప్పుడూ ఒకేలా ఉండ‌ద‌న్న‌ట్లుగా.. తాజా ప‌రిణామాలు స్ప‌ష్టం చేస్తున్నాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. తాజాగా తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ చేసిన ఫోన్ కాల్ కు పొరుగున ఉన్న రాష్ట్ర ముఖ్య‌మంత్రి సానుకూలంగా స్పందించ‌టం గ‌మ‌నార్హం. జూరాల‌కు నీటి విడుద‌ల‌పై క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రి కుమార‌స్వామితో కేసీఆర్ మాట్లాడారు. జూరాల ప్రాజెక్టుకు మూడు టీఎంసీల నీటిని విడుదల చేయాల‌ని కోరారు.

దీనిపై సానుకూలంగా స్పందించిన ముఖ్య‌మంత్రి.. ఒక‌ట్రెండు రోజుల్లో నీటి విడుద‌ల‌పై నిర్ణ‌యం తీసుకుంటామ‌న్నారు. జూరాల నీటిపై ఆధార‌ప‌డ్డ పాల‌మూరు గ్రామాల‌కు తాగునీటి కోసం సీఎం కేసీఆర్ తాజా విన‌తి చేశారు. కేసీఆర్ రిక్వెస్ట్ ను కుమార‌స్వామి ఓకే చేసే అవ‌కాశాలే ఎక్కువ‌గా ఉన్నాయ‌ని చెబుతున్నారు.