Begin typing your search above and press return to search.

కేసీఆర్ నోటి నుంచి జగన్ మాట

By:  Tupaki Desk   |   6 May 2020 4:45 AM GMT
కేసీఆర్ నోటి నుంచి జగన్ మాట
X
విజన్ తో చెప్పే మాటలు కొన్నిసార్లు కామెడీగా.. మరికొన్నిసార్లు ఎటకారంగా ఉంటాయి. నవ్వులు పాలు చేసే ఉదంతాలుగా నిలిచినా.. తర్వాతి రోజుల్లో అవే రోల్ మోడల్ మాటలుగా మారుతుంటాయి. తాజాగా అలాంటి పరిస్థితినే ఏపీ ముఖ్యమంత్రి వైఎ్ జగన్మోహన్ రెడ్డి ఎదుర్కొంటున్నారు. ఎంతో ముందుచూపుతో కరోనా వైరస్ విషయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారటం తెలిసిందే.

కరోనాతో కలిసి జీవనం సాగించాల్సిన అవసరం ఉందని.. సహజీవనం తప్పనిసరి అవుతుందని ఏపీ సీఎం జగన్ నోటి నుంచి వచ్చినంతనే భారీ ఎత్తున ఎటకారాలు మొదలయ్యాయి. ఇంత బాధ్యతారాహిత్యంతో మాట్లాడతారా? అంటూ ప్రశ్నల వర్షాన్ని కురిపిస్తున్నారు. ఇలాంటివేళలో.. ఊహించని రీతిలో ఆయన నోటి నుంచి వచ్చిన షాకింగ్ నిర్ణయాల ప్రభావం తాజాగా తెలంగాణ సీఎం మీదా పడినట్లుగా కనిపిస్తోంది.

కరోనా విషయంలో తీసుకోవాల్సని జాగ్రత్తల గురించి ఏకరువు పెడుతూనే.. మరోసారి లాక్ డౌన్ పొడిగింపు అంశాన్ని ప్రస్తావిస్తూ.. వైరస్ తో కలిసి బతకాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని సీఎం కేసీఆర్ మరోసారి స్పష్టంగా చెప్పేశారు. కరోనాతో కలిసి జీవనం చేయాల్సి ఉంటుందని.. దాని గురించి భయపడే కన్నా.. జాగ్రత్తలు తీసుకుంటే మంచిదన్నారు. కొద్ది రోజుల క్రితం జగన్ నోటి నుంచి ఇదే తరహాలో వ్యాఖ్యలు చేస్తే.. రాజకీయ ప్రత్యర్థులు మొదలు ఆయా రంగాలకు చెందిన వారు మహా ఎటకారం చేసేశారు.

స్వయం మేధావి ఇమేజ్ ఉన్న కేసీఆర్ సారు లాంటి పెద్ద మనిషి నోటి నుంచి జగన్ చెప్పిన మాటలే చెప్పటంతో ఏపీ సీఎంపై అదే పనిగా ఆడిపోసుకునే వారి నోటికి తాళం పడినట్లే. కరోనాతో సహజీవనం తప్పదన్న కేసీఆర్ మాటతో .. ఏపీ ముఖ్యమంత్రి నోటి నుంచి వచ్చిన మాటకు మరింత విలువ పెరగటం ఖాయం. ఇంతకాలం జగన్ఎ వ్యాఖ్యల్ని ఎటకారం చేసుకునే వారు.. తాజా పరిణామాల నేపథ్యంలో మౌనముద్ర దాల్చే అవకాశమే ఎక్కువ.