Begin typing your search above and press return to search.
అప్పుడే కోలుకున్న సారూ.. పూర్తిగా కోలువకోటానికి ఇన్ని రోజులా?
By: Tupaki Desk | 5 May 2021 4:40 AM GMTసామాన్యులు మొదలుకొని సెలబ్రిటీల వరకు కరోనా బారిన పడనోళ్లు లేరనే చెప్పాలి. మిగిలిన అన్ని వ్యవస్థల కంటే పవర్ ఫుల్ పొలిటికల్ వ్యవస్థలోని ఎంతమందిని వంగబెట్టేసింది కరోనా. కొందరికైతే ఐదారేళ్ల ముందే టికెట్ ఇచ్చి పంపించింది. బాధాకరమైన ఈ విషయాన్ని ఇలా చెబుతారా? అన్న భావన కలగొచ్చు. నిజమే మీరు అన్నదాన్లోనే పాయింట్ ఉంది. కానీ.. వ్యవస్థలు ఇలా తగలబడిపోవటానికి వారే ప్రధాన కారణం కదా? ఈ రోజున కరోనా విషాదం లేని కుటుంబం రెండు తెలుగు రాష్ట్రాల్లో లేని పరిస్థితి. రానున్న రోజుల్లో పరిస్థితులు మరింత భయానకంగా ఉంటాయని చెబుతున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. సాదాసీదా ప్రజలకు రిపోర్టులు తప్పు రావటం.. వారు మళ్లీ పరీక్షలు చేయించుకోవాల్సి రావటం మామూలు విషయం.
కానీ.. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి అలాంటి పరిస్థితి ఎదురుకావటం చాలా అరుదనే చెప్పాలి. చిత్రవిచిత్రలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే కేసీఆర్.. కోవిడ్ విషయంలో ఆయనకు ఎదురైన అంశాలు రోటీన్ కు కాస్త భిన్నంగా ఉంటాయని చెప్పాలి. దాదాపు వారం క్రితం.. ఆ మాటకు వస్తే.. యశోదాకు పరీక్ష (సిటీ స్కాన్) చేయించుకోవటానికి వచ్చిన ముఖ్యమంత్రి ఆరోగ్యం మెరుగైందని.. ఆయనంతా నార్మల్ అయ్యారని.. రెండు రోజుల్లో ఆయన తన కార్యకలాపాలు షురూ చేస్తారని చెప్పారు.
ఇది జరిగిన రోజుకే ఆయనకు చేసిన రిపోర్టు ఫలితం నెగిటివ్ గా వచ్చినట్లుగా వార్తలు వచ్చాయి. కొద్ది గంటలకే కాదు.. అసలు ఎలాంటి రిపోర్టులు రాలేదన్న మాట వినిపించింది. మొత్తంగా సీఎం రిపోర్టు ఏమొచ్చిందన్న దానిపై కన్ఫ్యూజన్ నెలకొంది.. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. కేసీఆర్ కు చేయించిన రిపోర్టులో నెగిటివ్ రాలేదని..పాజిటివ్ రావటం.. ఆ తర్వాత రిపోర్టు తప్పుగా తేలినట్లు గుర్తించారు. స్వయాన సీఎం రిపోర్టు పరిస్థితే ఇలా ఉంటే సామాన్యుడి పరిస్థితి ఏందన్న ప్రశ్న వినిపించింది.
ఆ తర్వాత నుంచి సీఎం కోవిడ్ రిపోర్టు గురించి కానీ.. ఆయన ఆరోగ్యం గురించి కానీ ఎలాంటి అప్డేట్ లేదు. అనూహ్యంగా మంగళవారం రాత్రి.. మరో ప్రకటన వెలువడింది. సీఎం వ్యక్తిగత వైద్యుడు ఎంవీ రావు అధ్వర్యంలోని వైద్యుల టీం ఆయనకు రాపిడ్ యాంటీజెన్ పరీక్షతో పాటు.. ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయటం.. రెండింటిలోనూ నెగిటివ్ రిపోర్టు వచ్చినట్లుగా తేల్చారు.
బ్లడ్ టెస్టుల్లోనూ అంతా నార్మల్ గా ఉన్నట్లుగా తేల్చారు. కోవిడ్ నుంచి కేసీఆర్ పూర్తిగా కోలుకున్నట్లుగా వైద్యులు నిర్దారించారు. ఈ మొత్తం ఎపిసోడ్ లో ట్విస్టు ఏమంటే.. అప్పుడెప్పుడో కోవిడ్ నుంచి కోలుకున్నట్లుగా తేల్చిన కేసీఆర్.. పూర్తిగా కోలుకోవటానికి ఇన్ని రోజులు పట్టటమా? అన్న సందేహానికి సమాధానం లభించని పరిస్థితి.