Begin typing your search above and press return to search.

జీహెచ్ ఎంసీ ఎన్నికలు: టీఆర్ ఎస్ మెగా మేనిఫెస్టో

By:  Tupaki Desk   |   18 Nov 2020 6:15 PM GMT
జీహెచ్ ఎంసీ ఎన్నికలు: టీఆర్ ఎస్ మెగా మేనిఫెస్టో
X
జీహెచ్ఎంసీ ఎన్నికలపై దూకుడుగా ముందుకెళుతున్న సీఎం కేసీఆర్ ఈరోజు పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులతో సమావేశమై గ్రేటర్ పై సమరశంఖం పూరించారు. టీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోను బుధవారం విడుదల చేశారు.

16 పేజీలతో కూడిన జీహెచ్ఎంసీ ఎన్నికల మేనిఫెస్టోను సీఎంకేసీఆర్ విడుదల చేశారు. కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ ఎల్పీ సమావేశం టీఆర్ఎస్ భవన్ లో జరిగింది. ఈ సందర్భంగా గ్రేటర్ ఎన్నికల్లో అనుసరించాల్సినవ్యూహంపై నేతలకు కేసీఆర్ దిశానిర్ధేశం చేశారు.

టీఆర్ఎస్ ప్రభుత్వం గ్రేటర్ లో చేసిన అభివృద్ధి, కరోనా చర్యలు, వరదల సమయంలో వ్యవహరించిన తీరును ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. అనంతరం మేనిఫెస్టోను విడుదల చేశారు.

*టీఆర్ఎస్ మేనిఫెస్టోలోని ముఖ్య అంశాలు ఇవీ..
* హైదరాబాద్ నగరమంతా ఉచిత వైఫై ఏర్పాటు చేస్తాం
* రూ.130 కోట్లతో 200 ఆదర్శ సమీకృత మార్కెట్ల ఏర్పాటు
* రూ.1,900 కోట్లతో మరో 280 కిలోమీటర్ల మేర మిషన్ భగీరథ పైపులైన్
* జీహెచ్ఎంసీ పరిధిలో అన్ని గ్రంథాలయాల ఆధునీకరణ
* కొత్తగా 4 ఆడిటోరియంల నిర్మాణం
* మూసీ పునరుద్దరణ, సుందరీకరణ..
* హుస్సేన్‌ సాగర్ శుద్ధికి ప్రణాళిక
* హైదరాబాద్‌లో ఆధునిక స్టేడియాలు, క్రీడా వసతులు