Begin typing your search above and press return to search.

మోడీని గాడు అన‌లేదు...ఆయ‌నంటే నాకు గౌర‌వం

By:  Tupaki Desk   |   3 March 2018 4:29 PM GMT
మోడీని గాడు అన‌లేదు...ఆయ‌నంటే నాకు గౌర‌వం
X

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ కేంద్రంగా సాగిన రాజ‌కీయ వివాదానికి ఫుల్‌స్టాప్ ప‌డింది. ఇటీవల జరిగిన రైతు సమన్వయ సమితుల సదస్సులో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ప్రధాని గాడు అన్నార‌ని వివాదం సాగిన సంగ‌తి తెలిసిందే. అయితే దీనికి తెలంగాణ మఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు క్లారిటీ ఇచ్చారు. హైద‌రాబాద్‌ లోని ప్రగతి భవన్‌ లో ఇవాళ అధ్యక్షన జరిగిన టీఆర్‌ ఎస్‌ పార్లమెంటరీ పార్టీ సమావేశం ముగిసింది. అనంతరం సీఎం కేసీఆర్‌ మీడియాతో మాట్లాడుతూ...తాను కేసీఆర్‌ గాడు అని సంబోధించలేదని తెలంగాణ సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. గారు అనేదాన్ని వ‌క్రీక‌రించి కొంద‌రు గ‌గ్గోలు పెడ‌తున్నార‌ని వ్యాఖ్యానించారు.

తాను అన్న మాటలను బీజేపీ నేతలు వక్రీకరించి మాట్లాడుతున్నారన్నారు. ప్రధాని గారు అన్నానే తప్ప.. గాడు అని సంబోధించలేదని తెలంగాణ సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. అయితే, తాను అన్న మాటలను బీజేపీ నేతలు వక్రీకరించి.. దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. ఇకనైనా బీజేపీ నాయకులు ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడాలని సీఎం కేసీఆర్‌ వార్నింగ్‌ ఇచ్చారు. టీఆర్‌ ఎస్‌ ప్రభుత్వ పాలన బాగుందని స్వయాన ప్రధాన మంత్రి నరేంద్రమోడీనే కితాబిచ్చారని సీఎం కేసీఆర్ చెప్పారు. ఈ నెల 5వ తేదీ నుంచి జరగనున్న పార్లమెంట్‌ సమావేశాల్లో కేంద్రాన్ని నిల దీయాలని నిర్ణయించినట్లు తెలంగాణ సీఎం కేసీఆర్‌ తెలిపారు. అయినా ప్రధానిని నిలదీస్తే.. జైలుకు పంపుతారా..? అంటూ సీఎం కేసీఆర్‌ బీజేపీ నేతలపై ఫైరయ్యారు. తెలంగాన ప్రతిపక్ష పార్టీలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఫైరయ్యారు. ఇటీవల జరిగిన రైతు సమన్వయ సమితుల సదస్సులో మాట్లాడుతూ..

అమెరికాలో ట్రంప్‌ పార్టీ ఎలా నడుస్తుందో.. తెలంగాణలో టీఆర్‌ ఎస్‌ పార్టీ అలాగే నడుస్తుందని సీఎం కేసీఆర్‌ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజల సంక్షేమం కోసం అద్భుతమైన పాలన కొనసాగిస్తున్నామని, రాష్ట్ర అభివృద్ధిని - ప్రజల అభివృద్ధిని చూసి ఓర్వలేని ప్రతిపక్షాలు టీఆర్‌ ఎస్‌ పై బురదజల్లే ప్రయత్నాలు జరుగుతున్నాయని సీఎం కేసీఆర్‌ అన్నారు. ప్రస్తుతం జాతీయ పార్టీలు బీజేపీ - కాంగ్రెస్‌ ఫ్రస్టేన్‌ లో ఉన్నాయని సీఎం కేసీఆర్‌ ఎద్దేవా చేశారు. టీఆర్‌ ఎస్‌ ప్రభుత్వ పాలనపై - అలాగే పార్టీ నేతల తీరుపై ఇటీవల కాలంలో రెండు సర్వేలు చేయించానని, ఆ సర్వేల్లో కాంగ్రెస్‌ కు పది సీట్లు రావడం కూడా కష్టంగానే కనిపిస్తోందని, బీజేపీకి మాత్రం అస్సలు సీట్లు రావ డమే గగనమని సీఎం కేసీఆర్‌ చెప్పారు.