Begin typing your search above and press return to search.
కేసీఆర్ న్యూ ఇయర్ గిఫ్ట్ వెరీ పవర్ ఫుల్
By: Tupaki Desk | 24 Aug 2017 5:09 PM GMTతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నూతన సంవత్సరం సందర్భంగా తెలంగాణ ప్రజలకు గొప్ప గిఫ్ట్ ఇవ్వనున్నారు! కానుక అంటే వస్తు రూపంలోనే ఉండాలనేం లేదు కదా? కానీ ముఖ్యమైనది - అత్యంత ఉపయుక్తమైనది కూడా కావచ్చు. అలాంటి ఉపయుక్తమైన గిఫ్ట్ నే కేసీఆర్ ఇవ్వనున్నారు. ఇంతకీ కేసీఆర్ ఇవ్వనున్న ఆ గిఫ్ట్ ఏంటంటే... ఇంటింటికీ సురక్షిత మంచినీరు. ఇది ప్రారంభించేంది 2018 జనవరి ఒకటో తేదీన! తను అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన మిషన్ భగీరథ పథకం ద్వారా ఈ గిఫ్ట్ ను కేసీఆర్ ప్రజలకు అందివ్వనున్నారట!
ఇంటింటికీ సురక్షిత మంచినీరు అందివ్వకుంటే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోమని సంచలన ప్రకటన చేసిన సీఎం కేసీఆర్ దాన్ని నిలబెట్టుకునేందుకు కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా మిషన్ భగీరథపై హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని ప్రజలందరికీ - అన్ని ఆవాసాలకు సురక్షిత మంచినీరు అందిస్తామని సీఎం కేసీఆర్ చెప్పారు. సవాల్ తీసుకొని మిషన్ భగీరథ పనులు చేపడుతున్నామని గుర్తుచేశారు. దేశంలో ఎవరూ చేయని సాహసం చేశామన్న ముఖ్యమంత్రి.. ఆ సవాల్ కు తగినట్టుగా పనులు చేయాలని అధికారులను ఆదేశించారు. సకాలంలో పనులు పూర్తి చేసి ప్రజలకు సురక్షిత మంచినీరు అందించడం మన రాష్ట్ర గౌరవానికి సంబంధించిన అంశమని సీఎం కేసీఆర్ తెలిపారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికే అన్ని గ్రామాలకు మంచినీరు అందాలని.. ఆ లోపే ఇన్ టేక్ వెల్స్ - వాటర్ ట్రీట్ మెంట్ల నిర్మాణం పూర్తి కావాలని సూచించారు. అధికారులు - ప్రజాప్రతినిధులు - వర్కింగ్ ఏజెన్సీలు రేయింబవళ్లు పని చేసి లక్ష్యాన్ని చేరుకోవాలని సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.