Begin typing your search above and press return to search.
తెలంగాణలో ముందస్తు ముచ్చట లేదు.. కేసీఆర్ సంచలన ప్రకటన
By: Tupaki Desk | 22 March 2022 2:30 AM GMTతెలంగాణలో కొన్ని రోజులుగా జరుగుతున్న ముందస్తు ఎన్నికల ముచ్చటపై ఈసీఎం కేసీఆర్ స్వయంగా స్పందించారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలపై సీఎం కేసీఆర్ స్పష్టతనిచ్చారు. ఆరునూరైనా ముందస్తు ఎన్నికలకు వెళ్లే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో కచ్చితంగా తమ ప్రభుత్వమే ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. మూడు సంస్థలు సర్వే ద్వారా ఇచ్చిన నివేదిక మేరకు.. తమ పార్టీ మరోసారి భారీ విజయాన్ని నమోదు చేస్తుందని నమ్మకం ఉందన్నారు. గతంలో అవసరం మేరకు ముందస్తు ఎన్నికలకు వెళ్లామని వివరణ ఇచ్చారు.
వచ్చే ఎన్నికల్లో కూడా రాష్ట్రంలో కచ్చితంగా టీఆర్ ఎస్ ప్రభుత్వమే వస్తుందని సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ఎల్పీ భేటీ అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడిన కేసీఆర్.. వచ్చే ఎన్నికల్లో భారీ విజయాన్ని నమోదు చేస్తామని పేర్కొన్నారు.
వచ్చే ఎన్నికల్లో 95 నుంచి 105 శాసనసభ స్థానాలు గెలుస్తామని అన్నారు. మూడు సంస్థలు 30 స్థానాల్లో సర్వే చేసి నివేదిక ఇచ్చాయని.. 30 స్థానాలకు గాను 29 స్థానాల్లో టీఆర్ ఎస్ గెలుస్తుందని నివేదిక వెల్లడించిందని చెప్పారు. 0.3 శాతం తేడాతో ఒక స్థానం కోల్పోతున్నట్లు నివేదిక వచ్చిందని పేర్కొన్నారు.
నివేదిక మేరకు 119 స్థానాలకు గాను 4 స్థానాలు కోల్పోతామని తెలుస్తోందన్నారు. మరో 25 రోజుల్లో నివేదిక బహిర్గతం చేస్తామని ప్రకటించారు. "ఈసారి మేము 95 నుంచి 105 స్థానాలు గెలుస్తాం. మూడు సంస్థలు 30 స్థానాల్లో సర్వే చేసి నివేదిక ఇచ్చాయి. 30 స్థానాలకు గాను 29 స్థానాల్లో టీఆర్ ఎస్ గెలుస్తుందని నివేదిక చెబుతోంది. ఈ మేరకు 119 స్థానాలకు గాను 4 స్థానాలు కోల్పోతామని తెలుస్తోంది. మరో 25 రోజుల్లో నివేదిక బహిర్గతం చేస్తాం.`` అని కేసీఆర్ వెల్లడించారు.
పీకేకి కేసీఆర్ కితాబు.. డబ్బులు తీసుకోకుండానే పనిచేస్తారట!
జాతీయ రాజకీయాలపై అడిగిన ప్రశ్నకు స్పందించిన సీఎం.. కేసీఆర్ అవసరం ఎక్కడ ఉంటే అక్కడికే వెళ్తానని వ్యాఖ్యానించారు. ప్రశాంత్ కిశోర్ ఎనిమిదేళ్లుగా తనకు మంచి స్నేహితుడని చెప్పిన కేసీఆర్.. ఆయన ఎప్పుడూ డబ్బులు తీసుకొని పనులు చేయరని పేర్కొన్నారు. దేశ రాజకీయాలపై ప్రశాంత్ కిశోర్‌కు అవగాహన ఉందని చెప్పారు. జాతీయ రాజకీయాలు ప్రభావితం చేయడానికి నిర్ణయం తీసుకున్నానని.. తన ఆహ్వానం మేరకు ప్రశాంత్ కిశోర్ వచ్చి పనిచేస్తున్నారని వెల్లడించారు.