Begin typing your search above and press return to search.

హరితహారం నిధి పై సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం

By:  Tupaki Desk   |   2 Oct 2021 12:30 AM GMT
హరితహారం నిధి పై సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం
X
తెలంగాణ రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం హరితహారం పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం కింద ప్రతి ఏటా కోట్లాది మొక్కలను నాటుతున్నారు. ఇప్పటికే ఈ కార్యక్రమం యొక్క ఫలితం కనిపిస్తోంది. అనేక ప్రాంతాల్లో చెట్లు పెరిగి కనువిందు చేస్తున్నాయి. మరోవైపు హరితహారం కార్యక్రమంపై ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. హరితహారాన్ని మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రత్యేకంగా హరిత నిధిని ఏర్పాటు చేస్తామని కేసీఆర్ చెప్పారు.

ఈరోజు అసెంబ్లీలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. పచ్చదనాన్ని పెంచడాన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని సూచించారు. హరిత నిధికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల జీతాల నుంచి నెలకు రూ. 500, ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ ఎస్ అధికారులు రూ. 100, ప్రతి ప్రభుత్వ ఉద్యోగి రూ. 25 ఇవ్వాలని కోరారు. అలాగే, రిజిస్ట్రేషన్లు, భవనాల అనుమతులు, వాహన రిజిస్ట్రేషన్ల సమయంలో కొంత మొత్తాన్ని వసూలు చేయాలని చెప్పారు. విద్యార్థుల అడ్మిషన్ల సమయంలో ఐదు రూపాయలు తీసుకోవాలని తెలిపారు. దీంతో పాటు వ్యక్తులు, సంస్థల నుంచి విరాళాలను సేకరించాలని చెప్పారు.

పచ్చదనం పెంపు పట్ల ప్రతీ ఒక్కరు తమ బాధ్యత, పాత్ర పోషించేలా చొరవ తీసుకునేలా చేసేందుకు తెలంగాణ హరిత నిధి ఏర్పాటు ప్రతిపాదన చేస్తున్నట్లు ఆయన చేశారు. స్వచ్ఛందంగా ముందుకు వచ్చే సంస్థలు, వ్యక్తుల నుంచి విరాళాల సేకరణ జరుగు తుందని సీఎం చెప్పారు.

హరితహార కార్యక్రమంపై అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆలోచనల నుంచే ఉద్భవించిన మరో మానస పుత్రిక హరితహార కార్యక్రమమని అన్నారు. హరితహారం కార్యక్రమంలో 230 కోట్ల లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్దేశించు కోగా, లక్ష్యాన్ని అధిగమించి 239 కోట్ల మొక్కలు నాటమని తెలిపారు. హరితహార కార్యక్రమానికి ఇప్పటివరకు రూ. 6555.97 కోట్లు వెచ్చించామన్నారు.హరితహార కార్యక్రమం సత్ఫలితాలు ఇస్తుందని, తెలంగాణ రాష్ట్రమంతా 3.67 శాతం పచ్చదనం పెరిగిందని వెల్లడించారు.ఇదే ప్రణాళికతో ముందుకుసాగుతూ 33% శాతం అటవీకరణ సాధిస్తామని తెలిపారు.అడవులు, పల్లెల్లో, పట్టణాల్లో ఎక్కడ చూసినా పచ్చదనం కనపడుతుందని , అటవీ శాఖ మంత్రిగా తాను వ్యక్తిగతంగా ఎంతో గర్వపడుతున్నాను అని అన్నారు.