Begin typing your search above and press return to search.
ఆ స్వామీజీని కలిసిన తర్వాతే కీలక భేటీకి కేసీఆర్ రెడీ
By: Tupaki Desk | 10 Nov 2018 6:23 PM GMTతెలంగాణ ముఖ్యమంత్రి - టీఆర్ ఎస్ పార్టీ అధినేత కే చంద్రశేఖర్ రావు ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికలకు సోమవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి తమ పార్టీ అభ్యర్థులకు బీ ఫారాలను అందజేసేందుకు సిద్ధమైంది. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్ లో ఆదివారం సాయంత్రం 4 గంటలకు జరిగే కార్యక్రమంలో పార్టీ అధినేత - సీఎం కేసీఆర్ చేతుల మీదుగా అభ్యర్థులకు బీ ఫారాలు అందించనున్నారు. పార్టీ అభ్యర్థులుగా ఎంపికైన వారందరినీ ఈ సమావేశానికి ఆహ్వానించారు. అంతకుముందు మధ్యాహ్నం సమయంలో సీఎం కేసీఆర్ తన సొంత నియోజకవర్గమైన గజ్వేల్ లో టీఆర్ ఎస్ కార్యకర్తలతో భేటీ కానున్నారు. అయితే, దీనికంటే ముందు రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లోని దివ్యసాకేతాన్ని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఇవాళ మధ్యాహ్నం సందర్శించారు. దివ్యసాకేతంలో సీఎం కేసీఆర్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ చిన జీయర్ స్వామి ఆశీస్సులు సీఎం కేసీఆర్ తీసుకున్నారు.
ఆధ్యాత్మికవాదుల్లో వివాదరహితుడిగా - సౌమ్యుడిగా త్రిదండి చిన్న జీయర్ స్వామీజికి పేరుంది. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నపుడు టీడీపీ ఎమ్మెల్యేలతో పాటు అధికారులకు శిక్షణా తరగతులు నిర్వహించి వారిలో చైతన్యాన్ని పెంచారు. తాజాగా ఆయన తెలంగాణ ప్రభుత్వ పెద్దలకు దగ్గరయ్యారు. చిన్నజీయర్ స్వామి అంటే సీఎం కేసీఆర్ ప్రత్యేకభిమానం ఉన్న సంగతి తెలిసిందే. తెలంగాణలో ప్రతిష్టాత్మక ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దే యాదగిరిగుట్ట నర్సింహస్వామి దేవాలయం పునర్ నిర్మాణం జీయర్ స్వామి ఆదేశానుసారం జరగాలంటూ కేసీఆర్ తేల్చిచెప్పారు. దీంతో పాటుగా పలు కీలక నిర్ణయాలను సైతం జీయర్ స్వామి ఆదేశానుసారమే కేసీఆర్ తీసుకున్నారు.
నామినేషన్ల దాఖలు ప్రక్రియ తోపాటే ఎన్నికల ప్రచారాన్ని మరింత తీవ్రం చేయాలని టీఆర్ ఎస్ భావిస్తున్నది. బీ ఫారాలు అందుకున్న అనంతరం అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేయడానికి ఈ నెల 11 నుంచి 19వ తేదీల మధ్య మంచి రోజును చూసుకొని - ముహూర్తాలు ఖరారు చేసుకుంటున్నారు. శుక్ర - శనివారాల్లో అష్టమి - నవమి ఉన్నందున అభ్యర్థులు ఆ రెండు రోజులు నామినేషన్లు వేసేందుకు ముందుకు రాకపోవచ్చు. ఈ నేపథ్యంలో ఇటు సెంటిమెంట్ పరంగా అటు మంచి రోజులకు సంబంధించి చర్చించేందుకు జీయర్ స్వామిని కేసీఆర్ కలిసి ఉంటారని సమాచారం.