Begin typing your search above and press return to search.
చేసిన తప్పును గుర్తించి.. సరిదిద్దుకున్న సీఎం కేసీఆర్
By: Tupaki Desk | 2 April 2020 6:15 AM GMTలక్షణం. కానీ.. పొరపాటున జరిగిన తప్పును.. వేలెత్తి చూపించినంతనే రియాక్ట్ అయి.. సరి చేసుకోవటం కొద్దిమందిలోనే ఉంటుంది.అందునా.. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వారు.. ఒకసారి తాము తీసుకున్న నిర్ణయాన్ని మార్చుకోవటానికి ససేమిరా అంటారు. అందుకు ఎంతకైనా సిద్ధమన్నట్లుగా వ్యవహరిస్తారు. లేనిపోని సమస్యల్ని కొని తెచ్చుకుంటారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దీనికి భిన్నం. పొరపాటున తన కారణంగా తప్పు జరిగితే.. దాన్ని వెనువెంటనే సరి చేసుకునేందుకు సిద్ధమవుతారు. తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి చోటు చేసుకుంది. కరోనా కారణంగా కకావికలమైన ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో కోతల వాతను పెట్టేస్తూ సంపన్న రాష్ట్ర సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం అస్సలు రుచించలేదు. ఎంత మాయదారి కరోనా అయినా.. రాష్ట్రం మీద ప్రభావం చూపించటం మొదలు పెట్టి కనీసం మూడు వారాలు కాలేదు.. ఆ మాత్రం దానికే ఆగమాగమైపోవాలా? అన్న ప్రశ్న పలువురి నోట వినిపిస్తోంది.
రోటీన్ కు భిన్నంగా చోటు చేసుకున్న పరిణామాలకు ఇంతలా ప్రభావితమైతే.. ధనిక రాష్ట్రమన్న డబ్బా అవసరమా? అన్న ప్రశ్నను సంధిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సీఎం మొదలు ప్రజాప్రతినిధుల జీతాలే కాదు.. ఐఏఎస్.. ఐపీఎస్ లతో సహా కేంద్ర సర్వీసులే కాదు.. ప్రభుత్వ ఉద్యోగుల్లో వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా సారు కోత వాత పెట్టేయటం తెలిసిందే. దీనిపై పలువురు మండిపడుతున్నారు. మరికొందరు సర్లే.. కరోనా కాలం ఏం చేస్తామని తమను తాము సర్ది చెప్పుకుంటున్నారు.
ఇదిలా ఉంటే.. అత్యవసర సర్వీసుల్లో భాగంగా విధులు నిర్వర్తిస్తూ.. ప్రాణాల్ని పణంగా పెట్టే వైద్యులు.. పోలీసులు.. అంగన్ వాడీ కార్యకర్తలు.. ఇలా చెప్పుకుంటూ పోతే.. ఎంతోమంది ఉద్యోగులు కరోనా వేళ సైతం.. ఇంటికి పరిమితం కాకుండా ఒళ్లు పులిసిపోయేలా పని చేస్తున్నారు. ఇలాంటి వారికి ప్రోత్సహాకాలు ఇవ్వాల్సింది పోయి.. అందుకు భిన్నంగా జీతాల్లో కోత పెట్టటాన్ని పలువురు తప్పు పడుతున్నారు. మొత్తానికి ఈ విషయం సీఎం కేసీఆర్ వరకూ వెళ్లింది.
ఈ విషయంపై అనవసరమైన ఇగోలకు పోకుండా.. తాను చేసిన నిర్ణయాన్ని వెంటనే మార్చేస్తూ దిద్దుబాటు ధోరణిని ప్రదర్శించారు కేసీఆర్. జీతాల్లో పెట్టిన కోతల నుంచి కొన్ని వర్గాల ఉద్యోగుల్ని మినహాయిస్తూ తాజాగా నిర్ణయం తీసుకున్నారు. వైద్య ఆరోగ్య శాఖ.. పోలీసులను మినహాయిస్తూ వారికి పూర్తి జీతాన్ని ఇవ్వాలని డిసైడ్ చేశారు. అంతేకాదు.. ఈ రెండు శాఖలకు చెందిన ఉద్యోగులకు నగదు ప్రోత్సాహాకాలు ఇవ్వాలని డిసైడ్ చేశారు. అదెంత అన్న విషయం రానున్న రెండు రోజుల్లో డిసైడ్ చేస్తారంటున్నారు.
తాజాగా ప్రగతిభవన్ లో నిర్వహించిన సుదీర్ఘ సమీక్ష లో.. కొన్ని శాఖలకు చెందిన ఉద్యోగుల్లో జీతాల్లో కోత నిర్ణయం ఏ మాత్రం సరికాదన్న భావన వ్యక్తమైన దరిమిలా.. ఇజాలకు పోకుండా వెంటనే దిద్దుబాటులోకి దిగిన సీఎం కేసీఆర్ తీరును అభినందిస్తున్నారు. ఏమైనా తప్పులు చేసి కూడా మైలేజీ పొందే విషయంలో సారు ముందుంటారని చెప్పకతప్పదు.