Begin typing your search above and press return to search.
ఢిల్లీకి సీఎం కేసీఆర్.. వ్యూహం ఇదే
By: Tupaki Desk | 28 Feb 2022 6:30 PM GMTతెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీకి పయనమయ్యారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయలు దేరారు. మూడ్రోజులపాటు ఆయన ఢిల్లీలోనే ఉండనున్నట్లు తెలుస్తోంది.
మంగళవారం ఉదయం ముఖ్యమంత్రి కేసీఆర్.. ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్‌తో సమావేశమవ్వనున్నట్లు సమాచారం. ఈ భేటీ తర్వాత ఢిల్లీలోని ఎయిమ్స్‌లో వైద్యపరీక్షలు చేయించు కోనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ముంబై, తమిళనాడులోని అధికార పార్టీ నేతలతో భేటీ అయిన కేసీఆర్ ఇప్పుడు ఢిల్లీ పర్యటన చేయడం ఆసక్తిగా మారింది.
జాతీయ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషించేందుకు పక్కా ప్లాన్ చేస్తున్న కేసీఆర్.. ఢిల్లీ పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. జాతీయ స్థాయిలో యాక్టివ్ రోల్ ప్లే చేసేందుకు కొత్త టీంను రెడీ చేస్తున్న కేసీఆర్ ఇప్పటికే.. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‌ను కలిశారు. సినీనటుడు, రాజకీయ నేత ప్రకాశ్ రాజ్‌ను కలిసి బీజేపీకి వ్యతిరేకంగా ఆయన మద్దతు కూడా కూడగట్టారు. ఇంకా అనేక ప్రాంతీయ పార్టీల నేతలతో చర్చలు జరుపుతామని చెప్పడంతో.. ఇప్పుడు ఢిల్లీ సీఎంతో కేసీఆర్ భేటీ చర్చనీయాంశమైంది.
మూడుజుల పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ కేంద్ర మంత్రులను కూడా కలిసే అవకాశముంది. విభజన హామీలు-సమస్యలు, రాష్ట్రానికి రావాల్సిన నిధులపై కేంద్ర మంత్రులతో కేసీఆర్ భేటీ అవ్వనున్నట్లు తెలుస్తోంది. ప్రధాన మంత్రితో సీఎం కేసీఆర్ భేటీపై స్పష్టత రావాల్సి ఉంది.
ఇదిలావుంటే, మరోవైపు మార్చి నెలాఖరులో జనగామలో భారీ బహిరంగసభను నిర్వహించి బీజేపీ సత్తా చూపిస్తామని రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకొని ఏప్రిల్ 14 నుంచి రెండో దశ ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభిస్తామని వెల్లడించారు.
ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై చర్చించేందుకు ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల జోనల్ స్థాయి సమావేశంలో అయన మాట్లాడారు. అయితే.. ఈలోపే.. కేసీఆర్.. వ్యూహాత్మకంగా.. జాతీయ రాజకీయాల్లో తన సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే ఆయన సుడిగాలి పర్యటనలకు కూడా రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. ఏదేమైనా.. తాజాగా కేసీఆర్ పెట్టుకున్న ఢిల్లీ పర్యటన ఆసక్తిగా మారింది.