Begin typing your search above and press return to search.
కేసీఆర్ ముక్కుపుడకలో పాలపిట్ట!
By: Tupaki Desk | 28 Jun 2018 4:47 AM GMTతెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగితే తాను మొక్కు చెల్లిస్తానంటూ పలువురు దేవుళ్లకు టీఆర్ఎస్ అధినేత హోదాలో మొక్కులు మొక్కుకోవటం తెలిసిందే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాలుగేళ్ల తర్వాత కూడా ఆయన మొక్కులు తీర్చే పరంపర కొనసాగుతోంది. ఆయన చెల్లించాల్సిన మొక్కుల్లో చివరగా మిగిలి ఉంది బెజవాడ దుర్గమ్మకు చెల్లించాల్సిన ముక్కుపడకే.
ఈ రోజు ఉదయం 11 గంటల తర్వాత సతీ సమేతంగా కలిసి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ బెజవాడకు వెళుతున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి దుర్గమ్మను దర్శించుకోనున్న ఆయన.. అమ్మవారి మొక్కును తీర్చుకోనున్నారు. ఈ సందర్భంగా తాను మొక్కును చెల్లించుకోనున్నారు. 11.96 గ్రాముల బరువుతో బంగారు ముక్కుపుడకను కేసీఆర్ చేయించారు. ఇందులో సుమారు 55 చిన్న చిన్న వజ్రాల్ని వినియోగించారు. ముక్కుపుడక మధ్యలో తెలంగాణ రాష్ట్ర పక్షి పాలపిట్ట బొమ్మను ఏర్పాటు చేయించటం గమనార్హం.
బెజవాడ దుర్గమ్మ దర్శనం కోసం వెళుతున్న సీఎం కేసీఆర్ తోపాటు ఆయన కుటుంబ సభ్యులే కాదు.. మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి.. ఇతర కీలక అధికారులు వెళ్లనున్నారు. బెజవాడ పర్యటనలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఆయన భేటీ కావటం లేదు.
కేసీఆర్ షెడ్యూల్ విషయానికి వస్తే..
ఉదయం 11.20కు ప్రగతి భవన్ నుంచి బేగంపేట ఎయిర్ పోర్ట్ కు వెళ్లటం..
ఉదయం 11.30 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట నుంచి విజయవాడకు
మధ్యాహ్నం 12 గంటలకు బెజవాడకు చేరుకోవటం
మధ్యాహ్నం 12.20గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టు ఎదురుగా ఉన్న ఏపీ వెటర్నరీ వర్సిటీ గెస్ట్ హౌస్ లో విశ్రాంతి
మధ్యాహ్నం 12.50 గంటలకు అమ్మవారి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు. మొక్కులో భాగంగా ముక్కుపుడకను ఆలయ అధికారులకు అందించటం. తీర్థ ప్రసాదాలు స్వీకరించటం
మధ్యాహ్నం 1.30 గంటలకు ఏపీ వెటర్నరీ వర్సిటీ గెస్ట్ హౌస్ లో సేద తీరటం
మధ్యాహ్నం 2.30 గంటలకు గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు బయలుదేరటం
మధ్యాహ్నం 3 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్ట్‌కు
మధ్యాహ్నం 3.10 గంటలకు ప్రగతి భవన్‌కు చేరుకోవటం