Begin typing your search above and press return to search.

కేసీఆర్.. రాజు గారి కథ..

By:  Tupaki Desk   |   12 Aug 2019 4:42 AM GMT
కేసీఆర్.. రాజు గారి కథ..
X
రాజులు.. రాజ్యాలు పోయాయి.. వారి పాలన వైభవం మాత్రమే ఉంది. నాటి రాజుల సంప్రదాయం మాత్రం ఇంకా కొనసాగుతోంది. ఎంత మంది ఔనన్నా.. కాదన్న కేసీఆర్ ‘రాజు’ కోణం మాత్రం ఆసక్తి రేపుతోంది. పొలిటికల్ సర్కిల్స్ ఇప్పుడిదే హాట్ టాపిక్ మారింది. కేసీఆర్ లోని ఓ రాజు కథ ఇప్పుడు చర్చ జరుగుతోంది.

పూర్వం రాజులు.. ముఖ్యంగా మూడు విషయాలకు అమిత ప్రాధాన్యమిచ్చేవారు.. ఒకటి దేశానికి రక్షణ కల్పించే రక్షకభటులు అంటే సైన్యానికి పెద్దపీట వేసేవారు. నమ్మకస్తుడైన సేనాధిపతిని పెట్టుకునేవారు.. రెండు పాలనలో బ్రాహ్మణులైన గురువులను, మేధావులను పక్కనే పెట్టుకునే వారు. వారి సలహాలతో పాలనను సాగించేవారు. మూడోది కళలకు ప్రోత్సాహం.. వివిధ కళాకారులు - విధ్వాంసులు- కవులు- రచయితలు- పండితులను ప్రోత్సహించి వారికి బహుమతులు, సత్కారాలు చేసేవారు.

నాటి శ్రీకృష్ణ దేవరాయల కాలం నుంచి అదే కథ కొనసాగింది. ఆశ్చర్యకరంగా ఇప్పుడు కేసీఆర్ హయాంలోనూ ఇదే రాచరిక వ్యవస్థ కొనసాగుతుండడం పొలిటికల్ సర్కిల్స్ లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇందులో నెగిటివిటీ కంటే కేసీఆర్ లోని పాజిటివిటీని మరో కోణంలో విశ్లేషిస్తున్నారు రాజకీయ పండితులు..

రాజులు చేసినట్టే కేసీఆర్ శాంతి భద్రతలకు అమిత ప్రాధాన్యం ఇస్తారు. సమర్థ పోలీసులు అధికారులను పెట్టుకోవడం దగ్గర నుంచి పోలీసులకు అత్యాధునిక వ్యవస్థల కల్పన- వాహనాలు- జీతాల పెంపు - కమాండ్ కంట్రోల్ వంటి సదుపాయాలను కేసీఆర్ కాదనకుండా చేస్తున్నారు. పోలీసుల రిక్రూట్ మెంట్ ప్రతీ ఏడాది నిర్వహిస్తున్నారు. ఇక సలహాదారులుగా, ప్రభుత్వాన్ని నడిపే కీలక పోస్టుల్లో తన వెంట బ్రాహ్మణ- మేధావులైన వ్యక్తులను కేసీఆర్ నియమించుకోవడం విశేషం. ముచ్చటగా మూడోది కళలను ప్రోత్సహించడం.. నిన్న కళాతపస్సి విశ్వనాథ్ ఇంటికి వచ్చిన కేసీఆర్ ఆయనకు శాలువ కప్పి, సన్మానించి ఏకంగా సినిమా నిర్మిస్తానని కొనియాడారు. నిర్మాతగా ఉంటానన్నారు. ఎవ్వరూ ఊహించని విధంగా కేసీఆర్ దర్శకుడు విశ్వనాథ్ ఇంటికి రావడమే అందరినీ ఆశ్చర్యపరిచింది.. పైగా ఈ తరహాలో కళా పోషణకు స్వయంగా ఆసక్తి చూపడం ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో ఆసక్తి రేపుతోంది.

ఇందులో నెగెటివ్ కోణాలను పక్కనపెడితే.. విమర్శలను విస్మరిస్తే.. కేసీఆర్ లోని ఈ కొత్త కోణం మాత్రం అందరికీ ఆశ్చర్యపరుస్తోంది. నాడు రాజులు చేసినట్టే నేడు కేసీఆర్ చేస్తున్నారన్న చర్చ సాగుతోంది. ఎవరూ ఏదైనా అనుకుంటారు.. కానీ ఎవ్వరూ ఊహించనవి చేయడంలో కేసీఆర్ దిట్ట. అందుకే ఇప్పుడు విశ్వనాథ్ ను కలువడంతోనే ఇలాంటి ఊహాగానాలు ఎన్నో వెలువడుతున్నాయి. కేసీఆర్.. ఒక రాజులా ప్రవర్తిస్తున్నారా అన్న సంగతి పక్కనపెడితే పోలికలను బట్టి చర్చించుకోవడం మాత్రం తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో సాగుతోంది.