Begin typing your search above and press return to search.

కర్నల్ కుటుంబానికి కేసీఆర్ పరామర్శ..5కోట్ల చెక్

By:  Tupaki Desk   |   22 Jun 2020 1:00 PM GMT
కర్నల్ కుటుంబానికి కేసీఆర్ పరామర్శ..5కోట్ల చెక్
X
భారత్-చైనా సరిహద్దుల్లో జరిగిన ఘర్షణల్లో వీరమరణం పొందిన కర్నల్ సంతోష్ బాబు కుటుంబాన్ని సీఎం కేసీఆర్ సోమవారం సూర్యపేటకు వెళ్లి పరామర్శించారు. సంతోష్ బాబుకు ఘన నివాళి అర్పించారు. సంతోష్ భార్య సంతోషి - తల్లిదండ్రులు - సోదరిలను ఓదార్చారు. సంతోష్ పిల్లలతో మాట్లాడారు.

ఈ సందర్భంగా కేసీఆర్ దేశ రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన సంతోష్ సేవలను కొనియాడారు. సంతోష్ మరణం తనను ఎంతగానో కలిచివేసిందని సీఎం చెప్పారు. సంతోష్ కుటుంబానికి ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని కేసీఆర్ హామీ ఇచ్చారు. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా తమను సంప్రదించాలని కేసీఆర్ సూచించారు. సంతోష్ కుటుంబ బాగోగులు చూసుకోవాలని మంత్రి జగదీష్ రెడ్డిని సీఎం కోరారు.

అనంతరం సంతోష్ భార్య సంతోషికి గ్రూప్1 ఉద్యోగానికి సంబంధించిన నియామకపత్రాన్ని కేసీఆర్ స్వయంగా అందజేశారు. హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో 711 గజాల స్థలానికి సంబంధించిన పత్రాన్ని సంతోష్ భార్యకు ముఖ్యమంత్రి అందించారు. సంతోష్ భార్యకు రూ.4కోట్ల చెక్, తల్లిదండ్రులకు రూ.1 కోటి చెక్కును సీఎం కేసీఆర్ అందించారు.