Begin typing your search above and press return to search.
శ్రీధర్ బాబు మీద కేసీఆర్ గుస్సా.. కారణం ఇదే!
By: Tupaki Desk | 23 Feb 2019 8:56 AM GMTతెలంగాణను భారీగా అభివృద్ధి చేసే పనిలో భాగంగా నిన్నటికి నిన్న రూ.1.80లక్షల కోట్లకు పైనా భారీ కలను అంకెల రూపంలో ఏర్చికూర్చి మరీ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ గా తయారు చేసిన కేసీఆర్ లెక్కల్ని కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు తప్ప పట్టటం ఆసక్తికరంగా మారింది.
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పంచాయితీలకు నిధుల కేటాయింపు విషయంపై ఆయన కాస్తంత లోతుల్లోకి వెళ్లారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పంచాయితీలకు తగినన్ని నిధులు ఇవ్వలేదని.. వడ్డీ మాపీ విషయంలోనూ రైతులు ఇప్పటికి ఇబ్బందులు పడుతున్నట్లుగా చెప్పిన శ్రీధర్ బాబు.. రైతుబంధు పథకంతో పాటు రైతులను ఆదుకోవాలన్నారు.
రైతుల సమస్యలతో పాటు.. ఉద్యోగులు ఐఆర్ కోసం ఎదురుచూస్తున్న వైనాన్ని తెర మీదకు తెచ్చారు. ఇలా.. ఒకటి తర్వాత ఒకటిగా సమస్యల్ని ఎత్తి చూపిన శ్రీధర్ బాబుపై సీఎం కేసీఆర్ విరుచుకుపడ్డారు. బడ్జెట్ లో గ్రామ పంచాయితీలకు ప్రభుత్వం నిధులు కేటాయించలేదంటూ శ్రీధర్ బాబు మాటల్లో పస లేదని.. ఆయన సభనను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు.
స్థానిక సంస్థల్ని అద్భుతంగా తీర్చిదిద్దనున్నట్లుగా చెప్పిన ఆయన.. పంచాయితీ నుంచి ఎలాంటి నిధులు తీసుకోలేదని.. వాటి పటిష్టతకు కొత్త చట్టాన్ని తీసుకురానున్నట్లు చెప్పారు. కొత్తగా కొలువు తీరిన అసెంబ్లీలో తన తప్పుల్ని పాయింట్ టు పాయింట్ అన్న రీతిలో విమర్శలు చేయటం కేసీఆర్ కు అస్సలు నచ్చనట్లుంది. అందుకే రంగంలోకి దిగిన కేసీఆర్.. శ్రీధర్ బాబుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఎవరూ తనను తప్పు పట్టే ధైర్యం చేయలేని వేళ.. తన మాటలు తప్పు అంటే కేసీఆర్ లాంటి అధినేతకు కోపం రాకుండా ఉంటుందా చెప్పండి?