Begin typing your search above and press return to search.

సీఎం కేసీఆర్‌ పీఎం కావాలంటూ.. ఒక కోడి, క్వార్టర్ మందు పంపిణీ

By:  Tupaki Desk   |   4 Oct 2022 5:32 PM GMT
సీఎం కేసీఆర్‌ పీఎం కావాలంటూ.. ఒక కోడి, క్వార్టర్ మందు పంపిణీ
X
కొడితే సీఎం కేసీఆర్ పీఎం అయిపోవాలి అంతే అన్నట్టుగా గులాబీ శ్రేణులు కూడా తొడగొడుతున్నాయి. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో దున్నేయాలని అప్పుడే టీఆర్ఎస్ నేతలు హల్ చల్ చేస్తున్నారు. దసరా పండుగ వస్తుండడంతో కేసీఆర్ ప్రధాని కావడం కోసం సేవా కార్యక్రమాలు చేస్తున్నారు.కొందరు తాజాగా దసరా కానుకగా కేసీఆర్ ప్రధాని కావాలని కోరుకుంటూ కార్మికులకు ఒక కోడి, క్వార్టర్ మద్యం పంపిణీ చేయడం సంచలనమైంది.

కేసీఆర్ ప్రధాని కావాలంటూ వరంగల్ కు చెందిన టీఆర్ఎస్ నేత రాజనాల శ్రీహరి ఒక కోడి, క్వార్టర్ మద్యం చొప్పున కార్మికులకు పంపిణీ చేశారు. అలాగే కేటీఆర్ తదుపరి రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలని శ్రీహరి పూజలు చేశారు. దసరా కానుకగా 200 మంది హమాలీలకు మద్యం, కోళ్లను అందించినట్టు శ్రీహరి తెలిపారు.

ఇక్కడే కాదు..మునుగోడులోనూ ఇదే కథ నడుస్తోంది. దసరా సందర్భంగా టీఆర్ఎస్ , బీజేపీ నేతలు ప్రజలను, కార్యకర్తలను ఆకట్టుకోవడానికి మద్యం, మాంసం పంపిణీ చేస్తున్నారు. తద్వారా ఓటు బ్యాంకును పదిలం చేసుకోవడానికి చూస్తున్నారు.

తెలంగాణలో అతిపెద్ద పండుగ దసరా..బతుకమ్మ. ఈ రెండు పండుగలు కలిసిరావడంతో మందు విందులతో ఘనంగా జరుపుకుంటారు. అందుకే ఈ పండుగకు గులాబీ శ్రేణులు కూడా సంబురంగా జరిపేందుకు రెడీ అవుతున్నాయి. ఎందుకంటే కేసీఆర్ కూడా ఈ దసరా నాడే (అక్టోబర్ 5)నే జాతీయ పార్టీ ప్రకటించబోతున్నారు. దశ, దిశ, పార్టీ జెండా సహా అన్నింటిని వివరించబోతున్నాడు. అందుకే కేసీఆర్ పీఎం కావాలంటూ టీఆర్ఎస్ నేతలు అప్పుడే తమ కోరికను వెలిబుచ్చుతూ ఇలా పంపిణీలు చేపట్టారని తెలుస్తోంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.