Begin typing your search above and press return to search.
కేసీఆర్‌ను చంపుతామంటూ బెదిరింపు కాల్
By: Tupaki Desk | 24 Feb 2016 9:20 AM GMTతెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని చంపేస్తామంటూ వచ్చిన బెదిరింపు కాల్ కలకలం సృష్టిస్తోంది. కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావుకు గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఇంటర్నెట్ కాల్ గా భావిస్తున్న ఈ ఫోన్ కాల్ లో తెలంగాణ ముఖ్యమంత్రిని హతమారుస్తామని బెదిరించటం గమనార్హం.
ఇదిలా ఉంటే.. కరీంనగర్ జిల్లా పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ సోదరి వివాహానికి ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు. కేసీఆర్ కు వచ్చిన బెదిరింపు కాల్ నేపథ్యంలో పోలీసులు అలెర్ట్ అయ్యారు. ఈ కాల్ వ్యవహారంపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ముఖ్యమంత్రిని హతమారుస్తామంటూ ఎమ్మెల్యేకు ఫోన్ రావటం.. ఇది ఎవరి పని అన్నది పెద్ద ప్రశ్నగా మారింది. ఇలాంటి బెదిరింపు కాల్స్ మీద యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలి. నిందితుడ్ని గుర్తించి కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది.