Begin typing your search above and press return to search.

మైనార్టీ కుటుంబం సెల్ఫీ వీడియోపై సీఎం జగన్ స్పందన

By:  Tupaki Desk   |   11 Sept 2021 7:22 PM IST
మైనార్టీ కుటుంబం సెల్ఫీ వీడియోపై సీఎం జగన్ స్పందన
X
కడప జిల్లా దువ్వూరుకు చెందిన ఓ మైనార్టీ కుటుంబం సోషల్ మీడియాలో పెట్టిన సెల్ఫీ వీడియోపై సీఎం జగన్ స్పందించారు. కడప జిల్లా ఎస్పీ అన్బురాజన్ తో మాట్లాడారు. ఎస్పీకి ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. వారంలో సమస్య పరిష్కరించాలని ఎస్పీ, కలెక్టర్ కు సీఎం జగన్ ఆదేశించారు.

మైదుకూరు రూరల్ సీఐ వ్యవహారంపై విచారణ జరిపి వారంలోగా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశించారు. భూమికి సంబంధించి వారంలో కలెక్టర్ విచారించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.

సెల్ఫీ వీడియో చూసి అక్బర్ భాషా కుటుంబాన్ని ఎస్పీ తనవద్దకు పిలిపించుకున్నారు. బాధిత కుటుంబం, కడప వైసీపీ నాయకులతో ఎస్పీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ అక్బర్ భాష సెల్పీ వీడియోపై రాత్రి 11.20 గంటలకు స్పందించామన్నారు. వెంటనే బాధితుడి ఇంటికి వెళ్లి వివరాలు తెలుసుకున్నట్టు వివరించాడు.

ఈనెల 9న ఎస్పీ స్పందన కార్యాలయంలో అక్బర్ పిటీషన్ ఇచ్చాడని ఎస్పీ తెలిపారు. 'సీఐ వ్యవహారంలో విచారణకు అదనపు ఎస్పీ దేవప్రసాద్ ను నియమించాం. సీఐ కొండారెడ్డిని 2 రోజుల పాటు విధుల నుంచి తప్పించాం. భూ సమస్య పరిష్కరించాలని సీఎంవో కూడా ఆదేశాలిచ్చింది' అని ఎస్పీ అన్బురాజన్ తెలిపారు.

ఇక వారంరోజుల్లో తమ సమస్య పరిష్కారిస్తామని ఎస్పీ హామీ ఇచ్చారని బాధితుడు అక్బర్ భాషా తెలిపారు. కడపలో ఎస్పీని కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సీఐ కొండారెడ్డి తీరుతో తమకు తీవ్ర ఆవేదన మిగిలిందన్నారు. సీఎం కార్యాలయం నుంచిఫోన్ వచ్చినట్లు ఎస్పీ తెలిపారని అక్బర్ తెలిపారు.