Begin typing your search above and press return to search.

ఆయుర్వేద మందుపై సీఎం సానుకూలం: ఆనందయ్య

By:  Tupaki Desk   |   23 May 2021 10:35 AM GMT
ఆయుర్వేద మందుపై సీఎం సానుకూలం: ఆనందయ్య
X
నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో కరోనా నివారణకు ఆయుర్వేద మందు తయారు చేసిన వైద్యుడు ఆనందయ్య తాజాగా హాట్ కామెంట్స్ చేశారు. సీఎం జగన్ తాను తయారు చేసిన ఆయుర్వేద ఔషధంపై సానుకూలంగా ఉన్నారని తెలిపారు. ప్రజలకు మేలు చేసేందుకే మందు తయారు చేశానని వివరించారు.

తన ఆయుర్వేద కరోనా మందు విషయంలో ప్రభుత్వం ఏం చెబితే అదే చేస్తానని ఆనందయ్య తెలిపారు. వేలమందికి ఈ మందు తయారు చేయాలంటే సమయం పడుతుందన్నారు.దానికి ప్రభుత్వం సహకరించాలన్నారు.

సోషల్ మీడియాలో వైరల్ గా మారిన హెడ్ మాస్టర్ కోటయ్యకు మందు వేసి నాలుగు రోజులైందని.. తన మందు వల్లే కోటయ్య ఇబ్బంది పడ్డారని చెప్పలేమని ఆనందయ్య తెలిపారు. తన మందుకు కొందరు అమ్మే ప్రయత్నం చేస్తున్నారని.. వారిపై చర్యలు తీసుకోవాలని ఆనందయ్య ప్రభుత్వాన్ని కోరారు.

కాగా ఆనందయ్య మందులో ఎలాంటి హానికర మందులు వాడడం లేదని.. ఇదో నాటు మందుగా ఆయుష్ కమిషనర్ రాములు తేల్చారు. ఆయుష్ ప్రతినిధుల సమక్షంలో ఆనందయ్య మందును తయారు చేశారు. కళ్లలో డ్రాప్స్ కూడా సాధారణ పదార్థాలేనని తేల్చారు. ఈ ఆనందయ్య మందు కరోనా రోగులపై పనిచేస్తుందా? లేదా అనేది ఆయుర్వేద డాక్టర్ల బృందం తేల్చుతుందని ఆయుష్ కమిషనర్ తెలిపారు. ఐసీఎంఆర్ నివేదిక తర్వాత మందు పంపిణీపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు.