Begin typing your search above and press return to search.
తెలంగాణ అధికారుల పేరుతో ఐటీకి సీఎం రమేశ్ ఝులక్?
By: Tupaki Desk | 13 Oct 2018 5:17 AM GMTఏపీ టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ ఆస్తులపై తాజాగా ఐటీ అధికారులు దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై ఢిల్లీలోని తన నివాసంలో సీఎం రమేశ్ మీడియాతో మాట్లాడుతున్న వేళ.. హైదరాబాద్ అధికారుల నుంచి ఫోన్ వచ్చింది.
దీంతో.. విలేకరుల సమావేశం నుంచి మధ్యలో లేచి వెళ్లారు సీఎం రమేశ్. అయితే.. లైవ్ కంటిన్యూ అవుతుండగానే.. సీఎం రమేశ్ ఫోన్ మాటలు సాగాయి. మీరు సాక్షులుగా తెలంగాణ అధికారుల్ని తీసుకొచ్చారు. మేం వాళ్లను ఒప్పుకోం.. సాక్షులనే వారు తటస్తులుగా ఉండాలని.. తెలంగాణ ప్రభుత్వం మాకు వ్యతిరేకం.. ఇప్పుడు నేను మాట్లాడుతున్నదంతా లైవ్ టెలికాస్ట్ అవుతోంది. అందువల్ల జాగ్రత్తగా చూసుకోండి. తటస్థులైన వారిని సాక్షులుగా పెట్టుకొని వారం.. పది రోజులు సోదాలు నిర్వహించినా మాకు ఎలాంటి అభ్యంతరం లేదు అంటూ సీఎం రమేశ్ చేసిన వ్యాఖ్యలన్నీ లైవ్ టెలికాస్ట్ అయ్యాయి.
అయితే.. ఈ ఎపిసోడ్ అంతా సీఎం రమేశ్ ప్లానింగ్ అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సాధారణంగా మీడియా సమావేశం జరుగుతున్నప్పుడు ముఖ్యమైన ఫోన్లు వస్తే మాట్లాడరు. కానీ.. సీఎం రమేశ్ మాట్లాడటం ఒక ఎత్తు అయితే.. లైవ్ లో ఉంచే.. సాక్షులుగా తెలంగాణ అధికారుల్ని తాను ఒప్పుకోనని చెప్పటం చూస్తే.. పక్కా ప్లానింగ్ తో సీఎం రమేశ్ వ్యవహరించారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఐటీ అధికారుల మాటలకు తెలంగాణ రంగు పులిమేసిన సీఎం రమేశ్ గురి చూసి కొట్టినట్లుగా లైవ్ ను ఆయుధంగా చేసుకున్నారన్న మాట వినిపిస్తోంది. ఐటీ అధికారులు తప్పించి మరెవరూ ఫోన్లు తీసుకెళ్లటానికి వీల్లేదని.. తటస్థుల ద్వారా మీ అధికారులను కూడా చెక్ చేయాలన్న మాట సీఎం రమేశ్ నోటి నుంచి రావటం గమనార్హం.
ప్రభుత్వం తమపై కక్ష సాధిస్తోందని.. మీరుకావాలని బయట నుంచి ఏదైనా తెచ్చి పెట్టినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదంటూ రమేశ్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. కావాలంటే పదిహేను నిమిషాలు టైమిస్తే.. తాను స్వతంత్ర వ్యక్తిని పంపుతానని చెప్పిన ఆయన.. మా ఉద్యోగులు.. మీ ఉద్యోగులు వద్దు.. తెలంగాణ అధికారులు వద్దు.. మీకు నాలుగు పేర్లు ఇస్తా.. వారిలో ఒకరిని ఎంపిక చేసుకోవాలని సూచింరారు.
అవతల ఫోన్లో ఉన్న ఐటీ అధికారి ఎవరో కానీ.. మామూలుగా అయితే.. ఐటీ అధికారులు సోదాలు నిర్వహించే వేళ.. తమకు సంబంధించిన సమాచారం కానీ.. వివరాలు కానీ బయటకు రావటం ఉండదు. కానీ.. లైవ్ లో పెట్టి మరీ.. ఐటీ అధికారుల్ని చిన్నబుచ్చేలా సీఎం రమేశ్ మాట్లాడారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.