Begin typing your search above and press return to search.

వారి చేతిలో సీఎం ర‌మేశ్‌కు చేదు అనుభ‌వం

By:  Tupaki Desk   |   21 Sep 2017 4:50 AM GMT
వారి చేతిలో సీఎం ర‌మేశ్‌కు  చేదు అనుభ‌వం
X
ఏపీ రాజ‌కీయాల్లో కీల‌క భూమిక పోషించ‌టంతో పాటు.. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు అత్యంత స‌న్నిహితుడైన రాజ్య‌స‌భ స‌భ్యుడు సీఎం ర‌మేశ్‌కు చేదు అనుభ‌వం ఎదురైంది. ఏపీ అధికార‌ప‌క్షం తాజాగా ఇంటింటికి టీడీపీ అనే కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టింది. పార్టీని మ‌రింత బ‌లోపేతం చేయ‌ట‌మే ల‌క్ష్యంగా ముందుకు వెళుతోంది.

ఇందులో భాగంగా రాజ్య‌స‌భ స‌భ్యుడు సీఎం ర‌మేశ్ క‌డ‌ప జిల్లాలో ప‌ర్య‌టించారు. జిల్లాలోని చాపాడులో నిర్వ‌హించిన ఇంటింటికి టీడీపీ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ఆయ‌న‌కు ముస్లిం మ‌హిళ‌ల చేతిలో చేదుఅనుభ‌వం ఎదురైంది. చాపాడులోని జెడ్పీ హైస్కూల్ వెనుక వీధిలో ప‌ర్య‌టిస్తున్న ఆయ‌న‌కు.. ఊహించ‌ని రీతిలో మ‌హిళ‌లు అడ్డుకున్నారు. సిమెంట్ రోడ్డు వేసిన త‌ర్వాత మాత్ర‌మే ఎంపీ రోడ్ల మీద‌కు రావాల‌న్నారు.

త‌మ వీధిలో సిమెంట్ రోడ్డు వేయాల‌ని మూడేళ్ల నుంచి అడుగుతున్నా.. ఇప్ప‌టివ‌ర‌కూ త‌మ మాట నెర‌వేర‌లేద‌న్న ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేసిన ముస్లిం మ‌హిళ‌ల పుణ్య‌మా అని సీఎం ర‌మేశ్ నోటి నుంచి మాట రాని ప‌రిస్థితి. నిర‌స‌న షాక్ నుంచి తేరుకున్న సీఎం ర‌మేశ్ ఎప్ప‌టి మాదిరి స‌ర్దిచెప్పే ప్ర‌య‌త్నం చేయ‌గా.. మాట‌లు వ‌ద్ద‌ని చేత‌ల్లో చేసి చూపించాలంటూ చెప్ప‌టంతో ఏం చేయాలో అర్థం కాని ప‌రిస్థితి నెల‌కొంది.

మ‌హిళ‌ల నిర‌స‌న‌కు సీఎం ర‌మేశ్ ఆగ్ర‌హాం వ్య‌క్తం చేస్తూ.. ఎందుకు అరుస్తారు? నెమ్మ‌దిగా చెప్పాలన‌గా.. త‌మ‌కు రోడ్డు కావాల‌ని అప్ప‌టివ‌ర‌కూ వీధిలోకి రావొద్ద‌ని మ‌హిళ‌లు తేల్చి చెప్పారు. మ‌హిళ‌ల డిమాండ్లు ఇలా ఉంటే.. ప‌లువురు స‌ర్పంచ్ లు.. స్పెష‌ల్ గ్రాంట్ల కింద చేసిన ప‌నులు ఇప్ప‌టికి బిల్లులు మంజూరు కాలేద‌న్న విష‌యాన్ని వెల్ల‌డించారు. మొత్తంగా తాజా ప‌ర్య‌ట‌న సీఎం ర‌మేశ్‌కు సొంత నియోజ‌క‌వ‌ర్గంలో చేదు అనుభ‌వం ఎదురైంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.