Begin typing your search above and press return to search.
వెలిగొండ ఎపిసోడ్లో సీఎం రమేశ్ కు అదిరే లాభం!
By: Tupaki Desk | 19 Aug 2018 5:30 AM GMTఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ పై తాజాగా వినిపిస్తున్న ఆరోపణ ఆసక్తికరంగా ఉండటమే కాదు.. అతగాడి మాస్టర్ మైండ్ ఎంతన్న విషయాన్ని చెబుతుందన్న మాట రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. వెలిగొండ ప్రాజెక్టు రెండో టన్నెల్ టెండర్ల వివాదంపై తనదైన శైలిలో కథ నడిపి.. ఇష్యూను క్లోజ్ చేయటమే కాదు.. తాను తట్టెడు మట్టి తీసి పక్కకకు వేయకుండానే రూ.200 కోట్ల వరకూ లాభాన్ని తన జేబులో వేసుకున్నారన్న మాట ఇప్పుడు వినిపిస్తోంది.
అదెలా సాధ్యమంటే.. సీఎం రమేశ్ స్కెచ్ అలానే ఉంటుంది మరి అన్న మాట పలువురు చెబుతున్నారు. ఆరోపణగా వినిపిస్తున్న ఈ ఉదంతంపై చెబుతున్న అంశాలు ఇలా ఉన్నాయి. వెలిగొండ ప్రాజెక్టు పనుల్లో భాగంగా రెండో టన్నెల్ పనులను ఒక కంపెనీ (జాయింట్ వెంచర్లో హెచ్ సీసీ-సీపీపీఎల్) రూ.735 కోట్ల చిల్లరకు 2007లో దక్కించుకుంది.
టెండర్ సమయంలో చెప్పిన విధంగా పనులను పూర్తి చేయలేదు. టైంకి పని పూర్తి చేయని కారణంగా పాత కాంట్రాక్టర్ ను ప్రభుత్వం మార్చేసింది. మిగిలిన పనుల విలువను రూ.299.48 కోట్లుగా ఐబీఎం తేల్చింది. అయితే.. కొందరి పుణ్యమా అని ఆ మొత్తాన్ని పెంచేశారు. చివరకు రూ.570.58 కోట్లతో పనులు పూర్తి అవుతాయని నిర్ణయించారు.
ఈ పనుల టెండర్ ఎట్టకేలకు రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ కు చెందిన కంపెనీకి వచ్చింది. అయితే.. రాష్ట్ర సర్కారు తమ వాదనలు వినకుండానే వేరే వారికి టెండర్ కట్టబెట్టారంటూ మొదట టెండర్ దక్కించుకున్న కంపెనీ కోర్టుకు వెళ్‌లింది. కోర్టులో వాదనలు విని.. లెక్కలు తేల్చాలన్న ఆదేశాలు జారీ అయ్యాయి. ఇలాంటి వేళ.. ఇష్యూను వివాదాస్పదం చేసుకోవటం.. అనవసరంగా రచ్చ చేసుకోవటం ఎందుకున్న ఆలోచనతో సీఎం రమేశ్ భారీ ప్లాన్ వేశారని చెబుతారు.
తన ప్లాన్ లో భాగంగా తనకు దక్కిన టెండర్ ను పాత కాంట్రాక్టర్ కే అప్పగించటం ఒక ఎత్తు అయితే.. తాను సొంతం చేసుకున్న టెండర్ మొత్తంలో కొంత మొత్తాన్ని పాత కాంట్రాక్టర్ కు ఇచ్చేసి.. మిగిలిన లాభాన్ని తన జేబులో వేసుకున్నట్లుగా చెబుతున్నారు. ఏ మాత్రం పని చేయకుండా లాభాన్ని సొంతం చేసుకున్న మొత్తం ఎంతంటారా? విశ్వసనీయ వర్గాలు.. కొన్ని మీడియా కథనాల ప్రకారం రూ.200 కోట్ల వరకూ ఉంటుందని చెబుతున్నారు. ఈ వ్యవహారం రాజకీయ.. వ్యాపార వర్గాల్లో కొత్త చర్చగా మారటమే కాదు.. సీఎం రమేశ్ వ్యూహచతురత అదిరిందన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.