Begin typing your search above and press return to search.
అమిత్ షా చెవిలో మోడీ మాట... ఆ ఎంపీకి అంత టైం ఇచ్చారే...?
By: Tupaki Desk | 16 Dec 2022 2:30 AM GMTఆయన తెలుగుదేశం పార్టీ అనుంగు తమ్ముడు. చంద్రబాబుకు కుడి భుజం. ఒక విధంగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు లేకపోతే ఆయన రాజకీయ జీవితం లేనేలేదు. ఆయనే సీఎం రమేష్. తెలుగుదేశం పార్టీ తరఫున రెండు సార్లు రాజ్య సభ ఎంపీ పదవి దక్కించుకున్నారు. అంటే పన్నెండేళ్ల పాటు పెద్ద మనిషిగా పెద్దల సభలో అధికారం చలాయించే సువర్ణ అవకాశాన్ని బాబు ఇచ్చారు.
దానికి సీఎం రమేష్ కూడా ఏమీ తక్కువ చేయలేదు. టీడీపీకి బలమైన ఆర్ధిక పునాదులలో ఆయన ఒకరుగా ప్రచారంలో ఉంటూ వచ్చారు. బాబు ఆదేశం మేరకు కడప జిల్లాను తాను దత్తత తీసుకుని పార్టీ తరఫున అన్ని విధాలుగా పోషిస్తూ వచ్చారని కూడా అంటారు. అలాంటి సీఎం రమేష్ 2019 ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోగానే బీజేపీలోకి జంప్ అయిపోయారు. ఆయనకు బాబు అన్నా టీడీపీ అన్నా ఇష్టం లేక జంప్ చేశారని చెప్పుకోవచ్చు.
కానీ దాన్ని ఆ రోజుకీ ఈ రోజుకీ నమ్మే వారు ఎవరూ లేరు. ఎందుకంటే మూడున్నరేళ్ళుగా బీజేపీలో ఉన్నా ఒక్క రోజు కూడా ఆయన బాబుని టీడీపీని పల్లెత్తు మాట అనలేదు. పైగా ఆయన తన అభిమానాన్ని ఇండైరెక్ట్ గా చాటుకుంటున్నారు అని కూడా ప్రచారం చేసేవారు ఉన్నారు. ఆయన వైసీపీ మీద ఒంటి కాలు మీద లేస్తారు బీజేపీలో ఉంటూ టీడీపీ గొంతుక వినిపించే నేతగా ఉంటూ వస్తున్నారు.
అలాంటి సీఎం రమేష్ లేటెస్ట్ గా కేంద్ర హోం మంత్రి, మోడీ తరువాత అటు పార్టీలో ఇటు ప్రభుత్వంలో అంతటి నాయకుడు అయిన అమిత్ షాతో ఏకంగా నలభై నిముషాల పాటు ఏకాంత భేటీ వేశారన్న వార్త ఇపుడు ఢిల్లీ నుంచి ఏపీ సర్కిళ్ళ దాకా వైరల్ అవుతోంది. మోడీ ఎవరికీ అంత టైం ఇవ్వరు. ఎంతో ఇంపార్టెంట్ మ్యాటర్ ఉంటే తప్ప ఆయన అసలు అపాయింట్మెంట్ కూడా ఇవ్వరు. ఆయన అపాయింట్మెంట్ కుదరక సీఎంలే తమ టూర్లు రద్దు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి.
మరి అంతటి అమిత్ షా సీఎం రమేష్ తో ఏకాంత భేటీని ఎందుకు కోరుకున్నారు. సుదీర్ఘంగా ఆయన ఏమి విన్నారు. ఈయన ఏమి చెప్పారు. అన్నది కూడా చర్చనీయాంశం అవుతోంది. ఇదిలా ఉంటే ఏపీలో బీజేపీ పొత్తు కోసం టీడీపీ వగచి వాపోతోంది. బాబు అయితే చకోర పక్షిలా అలా తన ప్రయత్నాలను తాను చేసుకుంటూ ఉన్నారని అందరూ చెబుతారు. ఏపీలో 2014 పొత్తులను రిపీట్ చేయగలిగితే చాలు జగన్ ఇంటికే అని బాబు గట్టిగా నమ్ముతున్నారు.
మరో వైపు జనసేన కూడా మూడు పార్టీలు కలవాలని అంటోంది. అయితే ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ సోము వీర్రాజు తో పాటు కీలక నేతలు మాత్రం పొత్తులు టీడీపీతో వద్దు అంటున్నారు. ఇక కేంద్రంలో మోడీ అమిత్ షాలు అయితే చంద్రబాబు పట్ల గుర్రుగా ఉన్నారని, బాబు తమ మీద ద్వజమెత్తిన ఫ్లాష్ బ్యాక్ సీన్లనే గుర్తు చేసుకుంటూ ఆయన్ని దూరం పెడుతున్నారని ప్రచారం సాగుతూ వచ్చింది. అయితే సీఎం రమేష్ ఈ భేటీలో మాత్రం ఏపీలో జగన్ని ఓడించే రోడ్ మ్యాప్ ని అమిత్ షా ముందు ఉంచారని అంటున్నారు.
ఏపీలో మూడు పార్టీలు కలిస్తే కచ్చితంగా జగన్ మాజీ సీఎం అవుతారని అమిత్ షాకు సీఎం రమేష్ చెప్పారని అంటున్నారు. ఒక విధంగా బాబు మాటను ఆయన విన్నపాన్ని కూడా బీజేపీ ఎంపీ అమిత్ షా చెవిన వేశారని అంటున్నారు. మరి అమిత్ షా ఏమి చేస్తారు అన్నది చూడాలి. ఇక్కడ ఒక విషయం గమనిస్తే ఇంత సమయం బీజేపీకి ఎంపీకి అమిత్ షా ఇచ్చారూ అంటేనే అర్ధం చేసుకోవాలని, కేంద్ర పెద్దల
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.