Begin typing your search above and press return to search.

చంద్రబాబు రేంజి తగ్గించిన సీఎం రమేష్

By:  Tupaki Desk   |   12 March 2018 5:12 AM GMT
చంద్రబాబు రేంజి తగ్గించిన సీఎం రమేష్
X
ఇంతకూ తెలుగుదేశం అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పది కోట్ల తెలుగు జాతికి ఆరాధ్యమైన నాయకుడా? లేదా ఆయన పరిధి కుంచించుకుపోయిందా? అనే సందేహాలు ఇప్పుడు కలుగుతున్నాయి. ఆయన ద్వారా రెండోసారి రాజ్యసభ ఎంపీ పదవిని దక్కించుకున్న సీఎం రమేష్ స్వయంగా చంద్రబాబు రేంజ్ ని కుదించేసినట్లుగా కనిపిస్తోంది. అధినేతకు కృతజ్ఞతలు చెబుతూ ఆయన రెండు రాష్ట్రాలలోని తెలుగు దినపత్రికలలో ఇచ్చిన ప్రకటన ఇలాంటి సందేహాలను రేకెత్తిస్తోంది.

చంద్రబాబు నాయుడు మాత్రం తాను తెలుగుదేశం పార్టీకి జాతీయ అధ్యక్షుడిని అని చెప్పుకుంటూ ఉంటారు. ఆ పార్టీ జాతీయ పార్టీ అని ఒక రకమైన బిల్డప్ ఇస్తూ ఉంటారు. తెలంగాణలో ప్రస్తుతానికి పార్టీ అంతరించిపో తున్న ప్పటికీ ఎప్పటికైనా మళ్లీ అధికారంలోకి వచ్చి తీరుతాం అని తనకు తోచినట్టుగా మాట్లాడుతూ ఉంటారు. ఆ రకంగా తాను రెండు రాష్ట్రాలలోనూ తెలుగువారందరికీ నాయకుడిని అని చంద్రబాబు ఫీలవుతూ వుంటారు.

అలాంటి చంద్రబాబుకు ఫ్యాన్స్ కు సీఎం రమేష్ పత్రికలో ప్రకటన విడుదల చేశారు. అందులో ఐదు కోట్ల నవ్యాంధ్ర ప్రజల హృదయాధినేత అంటూ చంద్రబాబు నాయుడు గురించి విశేషణం వాడారు. పాపం చంద్రబాబు రెండు రాష్ట్రాల్లోనూ తన ఇమేజి పదిలంగా ఉందని అనుకుంటూ ఉంటే సీఎం రమేష్ స్వయంగా ఈ ప్రకటన ద్వారా ఒక రాష్ట్రంలో దాన్ని తుడిచిపెట్టేసినట్టుగా కనిపిస్తోంది.

ఆ చంద్రుని కాంతి లోనే ప్రజా చైతన్య స్రవంతి లో ఊపిరి ఉన్నంతవరకు ఉంటాను అని చెబుతున్న సిఎం రమేష్ ఎన్నికల్లో ప్రజల తీర్పు కోరే ఎన్నికల్లోకి మాత్రం ఎందుకు అడుగుపెట్టరు చంద్రబాబుకే తెలియాలి. ప్రజాజీవితం పేరుతో ఆయన ఇంకా ఎంతకాలం పాటు పార్టీ సేవలు చేసుకుంటూ రాజ్యసభ సీట్లు పొందుతూ గడుపుతారో అర్థంకాని సంగతి. చంద్రబాబు ఆవాలు సగం చేసి కత్తెర వేసిన సీఎం ప్రకటనపై తెలుగు దేశం శ్రేణులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి .