Begin typing your search above and press return to search.
నీతులు సరే.. రిత్విక్ కన్‌స్ట్రక్షన్స్ సంగతేంది తమ్ముళ్లు?
By: Tupaki Desk | 13 Oct 2018 7:41 AM GMTతానేం చేసినా పట్టనట్లుగా ఉండాలి. తప్పులు జరుగుతున్నా పట్టించుకోకూడదు.ఒకవేళ.. ప్రశ్నించే ప్రయత్నం చేస్తే అది ఏపీ మీదా.. ఏపీ రాష్ట్ర ప్రజల మీద దాడిగా.. ప్రజాస్వామ్యం మీద జరుగుతున్న దాడిగా అభివర్ణిస్తుంటారు. తాజాగా టీడీపీ ఎంపీ సీఎం రమేశ్ ఆస్తుల మీద ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
ఒకవేళ.. సీఎం రమేశ్ కానీ సుద్దపూస అయితే..ఏం జరుగుతుంది? ఆయన తప్పులు చేయకుంటే.. అధికారులు వచ్చి.. తనిఖీలు చేసి ఏమీ లేవని వెళ్లిపోతారు. కానీ.. సీఎం రమేశ్ తీరు అందుకు భిన్నం. ఆయనకు చెందిన రిత్విక్ కన్ స్ట్రక్షన్ కు సంబంధించిన వివరాలు తెలుసుకుంటే చాలు.. ఆయన ఎలాంటివాడో.. ఆయన ఆస్తులపై ఐటీ అధికారులు ఎందుకు తనిఖీలు చేస్తున్నారో ఇట్టే అర్థమైపోతుంది.
ఏపీలో బాబు అధికారంలోకి రాక ముందు ప్రభుత్వ అధికారులకు.. వ్యాపార వర్గాల్లో రిత్విక్ కన్‌స్ట్రక్షన్ గురించి తెలిసింది చాలా తక్కువ. కానీ.. బాబు ఎప్పుడైతే ఏపీలో అధికారం లోకి వచ్చేశారో అప్పటి నుంచి సీఎం రమేశ్ కు చెందిన రిత్విక్ కన్ స్ట్రక్షన్ దూసుకెళుతోంది. రాష్ట్రంలో ఏ భారీ ప్రాజెక్టు అయినా రిత్విక్ ను దాటి వెళ్లలేదన్న మాట బలంగా వినిపిస్తోంది. బాబు పవర్లోకి రాక ముందు వరకూ ఆ సంస్థ అరకొర పనులే చేసేది. కానీ.. బాబు చేతుల్లోకి అధికారం వచ్చిన తర్వాత ఆ సంస్థ చేపట్టిన ప్రాజెక్టుల విలువ ఎంతో తెలుసా? దగ్గర దగ్గర రూ.3658 కోట్లు.
జీఎన్‌ఎస్‌ఎస్ - హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ - ఆర్టీపీపీ - వంశధార - కుప్పం బ్రాంచ్ కెనాల్ - వెలిగొండ టన్నెల్ పనులన్ని రిత్విక్ కే వచ్చాయని చెబుతారు. బీఎన్‌ఎస్‌ఎస్‌లో అతి తక్కువగా నిలిచిపోయిన పనులు రివైజ్డ్ రేట్లు వేయించుకొని భారీగా సొమ్ము చేసుకున్నట్లుగా ఆరోపనలు ఉన్నాయి. .
సీఎం రమేశ్ కు చెందిన కంపెనీ చేపట్టిన ప్రాజెక్టులకు మచ్చతునకులుగా చెప్పే వాటిని చూస్తే..
+ కుప్పం బ్రాంచ్ కెనాల్ రూ.522 కోట్లు,
+ హంద్రీ–నీవా సుజల స్రవంతి ఫేజ్–2 రూ.1000 కోట్లు
+ హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ విస్తరణ పనులు రూ.195 కోట్లు
+ హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ 34వ ఫ్యాకేజీ రూ.234కోట్లు
+ జీఎన్‌ఎస్‌ఎస్ ప్రాజెక్టులో రూ.350కోట్లు,
+ వెలిగొండ టన్నల్ రూ.270 కోట్లు
+ తెలుగుగంగ లైనింగ్ పనులు రూ.289 కోట్లు
+ గుంతకల్లు బ్రాంచ్ కెనాల్ రూ.172 కోట్లు
+ వంశధార ప్రాజెక్టు పనులు రూ.120 కోట్లు
+ ఆర్టీపీపీ 6వ ఫ్లాంటు నిర్మాణ పనులు రూ.400 కోట్లు
+ గండికోట ప్రాజెక్టు పునరావాస నిర్మాణం పనులు రూ.106 కోట్లు
ఈ తనిఖీలన్నీ మోడీ పుణ్యమేనని.. మోడీ సర్కారుపై అవిశ్వాస తీర్మానం సందర్భంగా.. తర్వాత నీ దగ్గరకే వస్తున్నానంటూ ప్రధాని అన్నారని.. అందుకు తగ్గట్లే తనపై ఐటీ శాఖ అధికారుల్ని పంపారంటూ ఆయన తప్పు పడుతున్నారు.