Begin typing your search above and press return to search.
ఆంధ్రోళ్లు అంతా కురియన్ కు థ్యాంక్స్ చెప్పాలి
By: Tupaki Desk | 11 May 2016 2:57 PM GMTఏపీ రాష్ట్ర విభజన సమయంలో విభజన బిల్లుపై రాజ్యసభలో చర్చ జరిగిన సందర్భంగా రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ గా ఉన్న కురియన్ తీరుపై పలువురు ఆంధ్రోళ్లు ఆగ్రహం చేశారు. విభజన బిల్లును ఎంత త్వరగా పాస్ చేసి పంపిద్దామనే తప్పించి.. ఏపీ ఎంపీల వాదనను ఏమీ పట్టించుకోలేదన్న గుస్సా చాలామందే వ్యక్తం చేశారు. నాడు అలా వ్యవహరించిన కురియన్.. నేడు రాజ్యసభలో వ్యవహరించిన ఆయన తీరు ఆంధ్రోళ్లకు ఉపశమనమే కాదు.. ఏపీకి చెందిన ఎంపీలకు ఓదార్పుగా నిలిచిందని చెప్పాలి. బుధవారం రాజ్యసభలో చోటు చేసుకున్న ఈ ఉదంతం విన్న ఆంధ్రోళ్లంతా కురియన్ కు థ్యాంక్స్ చెప్పటమే కాదు.. సీమాంద్రుల ఆవేదనను సభ ద్వారా దేశానికి తెలిసేలా చేశారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఇంతకీ సభలో ఏం జరిగిందన్న విషయాన్ని చూస్తే.. ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ మాట్లాడారు. విభజన కారణంగా ఏపీ ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిందని.. ఉత్తరాఖండ్ ను ఆదుకున్నట్లే ఏపీని ఆదుకోవాలని కోరారు. దేశంలో రాజధాని అంటూ లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే అది.. ఏపీ ఒక్కటేనని చెప్పిన ఆయన.. ఇప్పటికీ ఏపీని ఆదుకోకపోతే ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా నష్టపోతుందన్నారు. రెవెన్యూ లోటుతో ఏపీ కష్టాలు పడుతుందన్న సీఎం రమేశ్.. ఏపీని పూర్తిస్థాయిలో ఆదుకోవాల్సి ఉందన్నారు.
ఏపీకి అవసరమైన నిధుల గురించి ఆయన ఒక పేపర్ తీసుకొని సీఎం రమేశ్ చదవటం మొదలెట్టారు. ఈ సందర్భంగా కురియన్ కల్పించుకొని.. ఆయన పేరును పదే పదే ప్రస్తావించారు. అయినా.. రమేశ్ పట్టించుకోకుండా తన ప్రసంగ ధోరణిలో ఉండిపోయారు. అయినప్పటికీ కురియన్ .. ‘‘రమేశ్ ఒక్క మాట విను.. ఒక్క నిమిషం’’ అంటూ కల్పించుకునే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ సీఎం రమేష్ సానుకూలంగా స్పందించకపోవటంతో మరోసారి.. ‘‘రమేశ్ నా మాట ఒక్కసారి విను’’ అనటంతో ఈసారి రమేశ్ తన ప్రసంగాన్ని ఆపారు.
మీ రాష్ట్రం ఇబ్బందుల్లో ఉందా? అని కురియన్ అడగ్గా.. అవును సర్ అంటూ సీఎం రమేశ్ సమాధానం ఇచ్చారు. అయితే.. ఏ ఇబ్బందుల్లో ఉందన్న వెంటనే కొన్ని పేపర్లు పట్టుకొని చెప్పే ప్రయత్నం చేశారు. దీనికి స్పందించిన కురియన్.. ‘‘అంటే.. నీ రాష్ట్రంలో ఉన్న సమస్యలు నీకు తెలియక పేపర్లో ఉన్న సమాచారం చదువుతావా?’’ అని ప్రశ్నించటంతో.. పేపర్లను వదిలేసిన సీఎం రమేశ్.. ఏపీకి ఎన్ని ఇబ్బందులు ఉన్నాయన్న విషయాన్ని వరుసపెట్టి చదవటం మొదలెట్టారు.
కొన్ని లెక్కలు చెప్పి.. ఏపీకి ఎంత రెవెన్యూ లోటు వెంటాడుతుందన్న విషయాన్ని అంకెల సహా చెబుతున్న సీఎం రమేశ్ ను ఉద్దేశించిన కురియన్.. ‘‘శభాష్ రమేశ్.. ఇదే కావాలి. నీ ప్రాంతం గురించి ఏదో రాసుకొచ్చి చదివితే ఎలా? పేపర్ల మీద ఆధారపడకుండా ఇలా అడిగితే సమాధానాలు వస్తాయి’’ అంటూ ప్రోత్సహించటంతో విశేషం. నాడు విభజన విషయంలో కురియన్ తన ధర్మాన్ని నిర్వర్తించారని భావించినా.. తాజాగా ఏపీకి జరుగుతున్న అన్యాయం ఎంతన్న విషయం దేశం మొత్తానికి తెలిసేలా అవకాశం ఇవ్వటం గొప్పని చెప్పక తప్పదు. అందుకే.. ప్రతి ఆంధ్రోడు కురియన్ కు థ్యాంక్స్ చెప్పటంలో తప్పు లేదు.