Begin typing your search above and press return to search.

ఆదిని చేర్చుకోని బీజేపీ.. కారణం అతడేనా?

By:  Tupaki Desk   |   20 Sep 2019 11:42 AM GMT
ఆదిని చేర్చుకోని బీజేపీ.. కారణం అతడేనా?
X
బీజేపీలోకి నేనొస్తున్నాని ప్రకటన చేశాడు.. చంద్రబాబుతో కూడా చెప్పి ఢిల్లీకి ఫ్లైట్ ఎక్కారు.. అమిత్ షా లేదా జేడీ నడ్డా అపాయింట్ మెంట్ కోరాడు.. బీజేపీలో చేరికకు వారం నుంచి ఎదురుచూస్తున్నాడు..అయినా కడప జిల్లాలో సీనియర్ నేత - మాజీ మంత్రి అయిన ఆది నారాయణరెడ్డిని చేర్చుకునేందుకు బీజేపీ నేతలు ఆసక్తి చూపకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

బీజేపీలో చేరుతానని వారం కిందటే ప్రకటించిన ఆదినారాయణ రెడ్డి ఈ మేరకు బాబుకు చెప్పి మరీ ఢిల్లీ వెళ్లినా ఆయనకు అపాయింట్ మెంట్ ఇవ్వకుండా చేర్చుకోకుండా బీజేపీ పెద్దలు దూరం పెట్టడం చర్చనీయాంశమైంది.

అయితే ఇటీవలే టీడీపీ నుంచి బీజేపీలో చేరిన అదే కడప జిల్లాకు చెందిన రాజ్యసభ ఎంపీ సీఎం రమేష్ .. తనకు ప్రత్యర్థి అయిన ఆది నారాయణ రెడ్డి చేరికను అడ్డుకుంటున్న ఆది అనుచరులు ఆరోపిస్తున్నారు..

కడప జిల్లాలో కీలక నేత అయిన ఆది చేరితే రాజకీయంగా తనకు ఆ జిల్లాలో పట్టు ఉండదని భావించి సీఎం రమేష్ బీజేపీ పెద్దలతో మాట్లాడి ఆదిని చేర్చుకోకుండా చక్రం తిప్పినట్టు ఆది వర్గం అనుమానిస్తోంది. అందుకే వారం రోజులవుతున్నా ఆది బీజేపీలో చేరలేదు.

ఇక టీడీపీలో ఉన్నప్పుడు కూడా ఆదికి - సీఎం రమేష్ కు పడలేదని సమాచారం. జమ్మలమడుగు టికెట్ ఆదికి దక్కకుండా సీఎం రమేష్ చక్రం తిప్పారని ఆది వర్గీయులు ఆరోపించారు. ఇప్పుడు బీజేపీలో చేరికను అదే సీఎం రమేష్ అడ్డుకుంటున్నారని మండిపడుతున్నారు.