Begin typing your search above and press return to search.

రంగు మార్చిన సీఎం రమేశ్..అడ్డంగా బుక్కయ్యాడబ్బా!

By:  Tupaki Desk   |   21 Jun 2019 7:23 AM GMT
రంగు మార్చిన సీఎం రమేశ్..అడ్డంగా బుక్కయ్యాడబ్బా!
X
భారతీయ జనతా పార్టీలో చేరిపోయిన రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ పై నెటిజన్లు ఏకేస్తున్నారు. నిన్న సీఎం రమేశ్ తో పాటు మరో ముగ్గురు టీడీపీ ఎంపీలు పార్టీ మారినా... ఒక్క సీఎం రమేశ్ మాత్రమే నెటిజన్లకు టార్టెట్ అయ్యారు. ఒక్క టీడీపీ కార్యకర్తలే కాకుండా ఏ పార్టీతో సంబంధం లేని వారు కూడా ఇప్పుడు సీఎం రమేశ్ ను ఏకిపారేస్తున్నారు. ఓ రేంజిలో కొనసాగుతున్న ఈ ట్రోలింగ్ కు సీఎం రమేశ్ స్వయంకృతాపరాదమే కారణమని కూడా చెప్పక తప్పదు.

టీడీపీలోనే రాజకీయ ఓనమాలు దిద్దిన సీఎం రమేశ్.. పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడుకు అత్యంత సన్నిహితుడిగా ముద్రపడ్డారు. అంతేనా చంద్రబాబు కోటరీలో అత్యంత ముఖ్యుడిగా ముద్రపడిన సీఎం రమేశ్... పార్టీలో ట్రబుల్ షూటర్ గానూ వ్యవహరించారు. చంద్రబాబుకు సంబంధించిన అన్ని వ్యవహారాలతో పాటు పార్టీలో ఏ సమస్య వచ్చినా దాని పరిష్కారంలో సీఎం రమేశే కీలకంగా వ్యవహరించారు. అలాంటి సీఎం రమేశ్... తాజా ఎన్నికల్లో ఓటమితో పార్టీ కష్టాల్లో పడిపోతే... తాను మాత్రం సేఫ్ ప్యాసేజీని ఎంచుకున్నారు. సుజనా - గరికపాటి - టీజీ వెంకటేశ్ లతో కలిసి నిన్న బీజేపీలో చేరిపోయిన సీఎం రమేశ్... మిగిలిన ముగ్గురిలా సైలెంట్ గా ఉండలేకపోయారు.

నిన్న పార్టీ మారిన ఆయన నేటి ఉదయం తన ఫేస్ బుక్ ఖాతాలోని టీడీపీకి సంబందించిన ఫొటోలతో పాటు అన్ని వివరాలను డిలీట్ చేసేశారు. అంతేకాకుండా తన షేస్ బుక్ ప్రొఫైల్ పిక్ ను కూడా కాషాయంలోకి మార్చేశారు. ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా - వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నద్దాలతో ఉన్న తన ఫొటోలను అప్ లోడ్ చేశారు. సోషల్ మీడియాలో యమా యాక్టివ్ గా ఉన్న సీఎం రమేశ్ చేసిన ఈ మార్పులను చూసిన నెటిజన్లు భగ్గుమన్నారు. రెస్ట్ ఇన్ పీస్ అంటూ చాలా మంది నెటిజన్లు ఆయనను ట్రోల్ చేశారు. ఈ ట్రోలర్స్ లో టీడీపీకి చెందిన వారే కాకుండా ఏ పార్టీకి చెందని వారు కూడా ఉండటం గమనార్హం. తనతో పాటు పార్టీ మారిన సుజనా... పార్టీ మారిన తర్వాత కూడా తన రాజకీయ గురువు చంద్రబాబేనని చెప్పుకోగా... సీఎం రమేశ్ మాత్రం టీడీపీకి చెందిన గురుతులన్నీ తీసివేయడంతో నెటిజన్లకు అడ్డంగా బుక్కైపోయారని చెప్పాలి.